అంతర్జాతీయం

అర్థవంతమైన చర్చలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 29: అణ్వస్త్ర నిరాయుధీకరణ లక్ష్యాలను సాధించేందుకు గాను అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల మధ్య విశ్వాసాన్ని పాదుకొలపడానికి ఈ దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని భారత్.. ఐక్యరాజ్య సమితికి నొక్కి చెప్పింది. అణ్వస్త్రాలను కలిగి ఉండటం, అభివృద్ధి చేయడం, తయారు చేయడం, సేకరించడం, పరీక్షించడం, పెద్దఎత్తున నిల్వ చేయడం, రవాణా చేయడం, ఉపయోగించడం, ఉపయోగిస్తానని బెదిరించడం వంటి వాటిని నిషేధించడానికి సమగ్ర అణ్వస్త్రాల సదస్సుకు చెందిన ‘నిరాయుధీకరణ సమావేశం’లో చర్చలు జరిపేందుకు తాను ఏకరీతిగా మద్దతు ఇచ్చానని భారత్.. ఐరాస సర్వప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ)కు రాతపూర్వకంగా తెలియచేసింది. అణ్వస్త్రాల వినియోగంపై నిషేధం విధించడానికి ఉద్దేశించిన సదస్సులో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా భారత్ విడిగా పునరుద్ఘాటించింది. ‘అంతర్జాతీయ వ్యవహారాలు, భద్రతా అంశాలలో అణ్వస్త్రాల ప్రాముఖ్యతను తగ్గించడానికి, అణ్వస్త్రాలను కలిగి ఉన్న దేశాల మధ్య విశ్వాసాన్ని పాదుకొల్పడానికి ఈ దేశాలన్నింటి మధ్య అర్థవంతమైన చర్చలు జరగవలసిన అవసరం ఉంది’ అని ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. అలీనోద్యమ సహవాసిగా తనను తాను పేర్కొన్న అక్బరుద్దీన్.. అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని సాధించాలనే, అణ్వస్త్రాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత్ మే నెలలో చేసిన ఈ నివేదన గురువారం విడుదలయిన ఐరాస నివేదికలో భాగంగా ఉంది. ఐరాసకు ఇతర అనేక దేశాలు సమర్పించిన నివేదనలతో పాటు ఇది కూడా ఉంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)లోని నిబంధనల ప్రకారం అయిదు దేశాలు- అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనాలను అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలుగా పరిగణిస్తున్నారు. అణ్వస్త్రాలను కలిగి ఉన్న ఇతర దేశాలు భారత్, ఉత్తర కొరియా, పాకిస్తాన్. అణ్వస్త్ర నిరాయుధీకరణ లక్ష్యాన్ని అంచెలంచెలుగా సాగే ప్రక్రియ ద్వారా సాధించగలమని తాను భావిస్తున్నట్టు భారత్ ఐరాసకు సమర్పించిన తన నివేదనలో పేర్కొంది.