అంతర్జాతీయం

జోంగ్‌తో చర్చలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: అణు పరీక్షల అంశంపై ఉత్తర కొరియాతో చర్చలు జరపడం వల్ల సమయం వృథా కావడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చేశారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌ను ‘లిటిల్ రాకెట్ మ్యాన్’గా తన ట్వీట్‌లో ట్రంప్ సంబోధించారు. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ ఓ పక్క ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రాధాన్యత చేకూరింది. ‘మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. లిటిల్ రాకెట్ మ్యాన్‌తో చర్చలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ శ్రమను వృథా చేసుకోకుండి.. ఏమి చేయాలో అదే చేద్దాం’ అని టిల్లర్‌సన్‌ను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యకు దౌత్య పరమైన పరిష్కారం కనుగొనేందుకు టిల్లర్‌సన్ చేపట్టిన ప్రయత్నాలకు విరుద్ధంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది అయోమయంగా మారింది.