అంతర్జాతీయం

మడగాస్కర్‌లో ప్రబలిన ప్లేగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటనానారివో, అక్టోబర్ 1: మడగాస్కర్‌లో ప్రబలిన ప్లేగు వ్యాధిని అరికట్టడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆదివారం తెలిపింది. మడగాస్కర్‌లో ప్లేగు వ్యాధి సోకి 24 మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి ప్రభుత్వం దేశంలో బహిరంగ సమావేశాలపై నిషేధం విధించింది. మడగాస్కర్ దేశ రాజధాని అంటనానారివోలో ఇటీవల ప్లేగు వ్యాధి సోకి ఆరుగురు మృతి చెందారు. దేశ ప్రధాని ఓలివియెర్ మహాఫాలి సోలోనంద్రసన శనివారం టెలివిజన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజధాని అంటనానారివోలో ఎలాంటి బహిరంగ సభలు, ప్రదర్శనలకు అనుతించడం జరుగబోదని తెలిపారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆరోగ్య విభాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమావేశమయిన అనంతరం ఆయన మాట్లాడుతూ విమానాశ్రయాలు, బస్ స్టేషన్లలో ప్రయాణికులు భయాందోళనలు చెందకుండా ఉండటానికి, ప్లేగు వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మడగాస్కర్ 1980 నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ప్లేగు మహమ్మారి బారిన పడుతోంది. తరచుగా అడవుల్లో మంటలంటుకున్నప్పుడు అక్కడి నుంచి పారిపోయి జనావాసాల్లోకి వస్తున్న ఎలుకల వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తోంది. అయితే ఈ ఏడు మాత్రం వ్యాధి అసాధారణ స్థాయిలో వ్యాపిస్తోందని, ఇప్పటికే అనేక పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సంక్రమించిందని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. ఈసారి ప్లేగు మహమ్మారి రెండు రకాలుగా విస్తరిస్తోంది. ప్లేగు వ్యాధి సోకిన ఎలుకల నుంచి ప్రజలకు వ్యాధి సంక్రమించడం (బుబోనిక్ ప్లేగ్) ఒకటి కాగా, వ్యాధి సోకిన మనిషి నుంచి అది ఇతరులకు సోకడం (న్యుమోనిక్ ప్లేగ్) రెండో రకం. అంటు వ్యాధి అయిన ప్లేగు త్వరగా వ్యాపిస్తుంది. ప్లేగు వ్యాధిని తుడిచిపెట్టడానికి ముందు అది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్నది. ‘మడగాస్కర్ లో ఇప్పటికే అనేక నగరాలకు ప్లేగు వ్యాధి విస్తరించడంతో పాటు ఇది అంటు వ్యాధులు ప్రబలే కాలం అయినందున ఈ వ్యాధి వేగంగా వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది’ అని మడగాస్కర్‌లోని ఆ సంస్థ ప్రతినిధి ఆదివారం తెలిపారు.