అంతర్జాతీయం

అంతుబట్టని ఉన్మాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌వెగాస్, అక్టోబర్ 3: లాస్‌వెగాస్‌లో జరిగిన భయానక మారణకాండకు కారణమేమిటనే దానిపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఓ మాజీ ఉద్యోగి ఇంతమందిని బలిపెట్టడానికి కారణం ఏమిటి? అసలు అతడి ఉద్దేశం ఏమిటి అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఘాతుకానికి బాధ్యుడైన స్టీఫెన్ క్రెయిగ్ పెడాక్ తమకు చెందినవాడేనంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటనపై కూడా అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. గతంలో అనేక నేరాలతో సంబంధం ఉన్న 64 సంవత్సరాల ఫెడాక్ అనూహ్య రీతిలో ఓ సంగీత విభావరిపై దాడిచేసి 58 మందిని మట్టుబెట్టిన ఘటన ఇటీవలి కాలంలో అత్యంత హేయమైనదిగా చెబుతున్నారు. ఏకకాలంలో వేలాదిమందిపై కాల్పులు జరపడం అన్నది మామూలు వ్యక్తి చేసే పని కాదని, ఇందుకు పాల్పడ్డ పెడాక్‌కు ఏదో ఉద్దేశం ఉంటుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు కాల్పులు ఎక్కడినుంచి జరుగుతున్నాయో తెలియనంత తీవ్రస్తాయిలో పెడాక్ గుళ్లవర్షం కురిపించడం, మరణించినవారు మరణించగా మరో 500 మంది గాయపడడం అత్యంత హేయమైన ఘాతుకంగా అధికారులు చెబుతున్నారు. ఈ ఊచకోతకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ‘అనేక మంది కుప్పకూలిపోయారు. వాళ్లు పడిపోయారా లేక తుపాకీ గుళ్లకు నేలకూలారా అన్నది మాకు అయోమయంగానే మారింది’ అంటూ లాగ్‌వెగాస్ సమీపంలోని పొమోనా వ్యాలీకి చెందిన ఐటి నిపుణుడు రాల్ఫ్ రోడ్రిగ్యూ అన్నారు. ఈ ఘాతుకంపై ఒక ప్రకటన జారీ చేసిన ఐసిస్ పెడాక్ తమ సైనికుడేనని స్పష్టం చేయడంతో ఈ మొత్తం వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. అయితే ఎఫ్‌బిఐ అధికారులు మాత్రం ఈ ఘాతుకానికి ఐసిస్‌తో సంబంధం లేదన్నట్లుగానే తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెడాక్ ఓ మానసిక ఉన్మాది అని, ఆ ఉన్మత్త ధోరణిలోనే ఈ కాల్పులకు పాల్పడ్డాడంటూ అధికారులు చెబుతున్నారు. కాగా సంఘటన స్థలానికి 130 కి.మీ దూరంలో ఉన్న పెడాక్ ఇంటిపైన దాడిచేసిన పోలీసులు అనేక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వేలాది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లోనే అమ్మోనియం నైట్రేట్‌తోపాటు టానెరైట్ అనే ఓ భయానక పేలుడు పదార్థం కూడా తమకు చిక్కిందని తెలిపారు. ఈ సంఘటన నేపథ్యానికి సంబంధించి ఏ చిన్న అంశాన్ని వదలడం లేదని అధికారులు తెలిపారు. పెడాక్ ఆలోచనలకు సంబంధించి ఇంతవరకూ తమకు ఏ రకమైన ఆధారాలు లభించలేదని, అతడో ఏకాకి అని స్పష్టం చేశారు.

ఆంగ్ సాన్ సూకీకి ఎదురుదెబ్బ

*గౌరవ హోదాను వెనక్కు తీసుకున్న ఆక్స్‌ఫర్డు

లండన్, అక్టోబర్ 3: రోహింగ్యాల సంక్షోభంపై తగిన విధంగా స్పందించడంలో విఫలమైన మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి గతంలో ఆక్స్‌ఫర్డు నగరం ఇచ్చిన గౌరవాన్ని వెనక్కు తీసుకుంది. ప్రజాస్వామ్యం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన అంగ్ సన్ సుకీకి 1997లో ఆక్స్‌ఫర్టు నగరం ‘ఆక్స్‌ఫర్డు స్వేచ్ఛ’ హోదాను కల్పించింది. ప్రస్తుత తరుణంలో ఆమెకు ఈ హోదాను కొనసాగించడం సముచితం కాదని భావించిన నగర కౌన్సిల్ హోదాను విరమించుకుంటూ తీర్మానం చేసింది. ఈ మేరకు కౌన్సిల్ నాయకుడు బాబ్ ప్రైస్ తీర్మానానికి మద్దతు తెలిపారు. ఈ మేరకు త్వరలోనే నగర కౌన్సిల్ సమావేశమవుతుందని, నవంబర్ 27 నుండి వర్తించేలా ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన అంగ్ సన్ సుకీ ఆక్స్‌ఫర్టు నగరంతో సన్నిహిత సంబంధమే ఉంది. ఆమె కుటుంబం పార్కుటౌన్‌లో నివసించేది. అక్కడే సెయింట్ హ్యూగ్ కాలేజీలో మూడేళ్లపాటు చదువుకుంది. అదే కాలేజీలో సుకీ కృషికి గుర్తింపుగా ఒక చిత్రపటాన్ని గతంలో ప్రదర్శన మందిరంలో ఉంచగా, దానిని తొలగిస్తున్నట్టు ఇటీవల ప్రకటన చేసిన మరుసటి రోజే ఆక్స్‌ఫర్డు నగర కౌన్సిల్ సైతం తామిచ్చిన హోదాను వెనక్కు తీసుకుంటూ తీర్మానం చేసింది.