అంతర్జాతీయం

పాక్‌ది అరణ్య రోదనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, అక్టోబర్ 4: కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్నవన్నీ అభూతకల్పనలేనని, అరణ్యరోదన చందమేనని భారత్ తీవ్ర స్వరంతో తిప్పికొట్టింది. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని భారత్ ప్రేరేపిస్తుందంటూ పాక్ రాయబారి ఐరాసలో చేసిన ఆరోపణలను భారత ప్రతినిధి ఇనామ్ గంభీర్ తిప్పికొట్టారు. పాక్ చేసిన ఆరోపణలపై సమాధానం ఇచ్చే హక్కును వినియోగించుకున్న భారత ప్రతినిధి గతంలో మాదిరిగానే పాకిస్తాన్ ఏకాకిగానే కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిందన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నోసార్లు కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించినా దానిపై ఐరాసలో చర్చ జరిగిన సందర్భమే లేదని గంభీర్ అన్నారు. తన వాదనను ప్రపంచ దేశాలు పట్టించుకోకపోయినా సరే పాకిస్తాన్ మాత్రం అదే పనిగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతునే వస్తోందని ఆమె విమర్శించారు. ఈ అప్రస్తుత అంశంపై మరింతగా మాట్లాడం ద్వారా ఐరాస విలువైన సమయాన్ని తాము వృధా చేయదలచుకోలేదని ఆమె తెలిపారు. ఇటీవల ఐరాస జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ధోరణిని ఎండగట్టిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌పై ఐరాస చేపట్టిన తీర్మానాలను ఎవరూ పట్టించుకోకపోయినా వాటినే పట్టుకుని పాక్ వేలాడుతోందని సుష్మా అన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని అబ్బాసీని లక్ష్యంగా చేసుకునిన ఆ సదస్సులో సుష్మా మాట్లాడారు. ఐరాస తీర్మానాలకు కాలం చెల్లినాకూడా ప్రపంచ దేశాలేవీ వాటిని పట్టించుకోకపోయినా అబ్బాసీ మాత్రం వాటిని వదలడం లేదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని భారత్-పాక్‌లు నిర్ణయించుకున్న విషయాన్ని కూడా అబ్బాసీ మరచిపోవడం విడ్డూరం అన్నారు.

కాశ్మీర్‌పై పాక్ పాతపాట

న్యూయార్క్, అక్టోబర్ 4: ఐక్యరాజ్య సమితిలో మరోసారి కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. కాశ్మీర్ లోయ ప్రాంతంలో భారత్ ఉగ్రవాదాన్ని రగిలిస్తోందంటూ పాక్ రాయబారి మలీహా లోధి తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్ రాయబారి‘ పాక్ ఆక్రమిత ప్రాంతంలో భారత్ జరిపిన లక్షిత దాడులన్నీ అబద్ధం’అని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ తప్పుడు ప్రకటనలు చేసిందని, తద్వారా పాకిస్తాన్‌తో సంఘర్షణలను రగించేందుకు ప్రయత్నించిందని లోధి అన్నారు. భారత్ ఎలాంటి దురాక్రమణలు పాల్పడినా అంతే తీవ్రస్థాయిలో పాకిస్తాన్ ప్రతిస్పందిస్తుందని కూడా ఆమె హెచ్చరించారు. భారత్ పదేపదే చెప్పుకుంటున్న లక్షిత దాడులు ఐరాస చాప్టర్‌కే విరుద్ధమని ఆమె అన్నారు. ఐక్యరాజ్య సమితి పనితీరుకు సంబంధించి సెక్రెటరీ జనరల్ సమర్పించిన నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన పాక్ రాయబారి పనిగట్టుకు మరీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
భారత్ చేస్తున్న బహిరంగ హెచ్చరికలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించడానికి వీల్లేదని ఆమె ఐరాసకు విజ్ఞప్తి చేశారు. అలాగే పాకిస్తాన్‌ను రెచ్చగొట్టేందుకు భారత్ చేస్తున్న ప్రకటనలపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ ప్రజలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఆధీనరేఖ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్ దైనందిన వారీగా ప్రకటనలు గుప్పిస్తోందని అన్నారు. మానవత్వంపై భారత్ చేస్తున్న ఈ దాడులను విస్మరించడానికి వీల్లేదని ఐరాసలో సభ్యత్వం కలిగిన దేశాలన్నీ నిలదీయాలని లోధీ పిలుపునిచ్చారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామన్న సాకుతో కాశ్మీర్ ప్రజలపై భారత్ చేస్తున్న దాడులను ప్రపంచ దేశాలన్నీ గర్హించాలని అన్నారు.