అంతర్జాతీయం

ఓబిఓఆర్‌పై భారత్‌కు అమెరికా మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 4: చైనా అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఒన్ బెల్ట్-ఒన్ రోడ్ (ఓబిఓఆర్) విషయంలో భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. దాదాపు 50 బిలియన్ల డాలర్ల ఖర్చుతో నిర్మితమవుతున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి కూడా భారత్ వాదననే అమెరికా బలపరిచింది. ఓ వివాదాస్పద ప్రాంతం నుంచి దీని నిర్మాణం సాగుతుందని పేర్కొన్న అమెరికా ఏ దేశం కూడా ఈ అంశంపై నియంతృత్వ ధోరణితో వ్యవహరించకూడదని తేల్చిచెప్పింది. ఈ ఆర్థిక కారిడార్ నిర్మాణం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా సాగే అవకాశం ఉన్నందున దాన్ని భారత్ తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకించింది. చైనా నాయకత్వానికి కూడా ఈ అంశంపై తన నిరసనను తెలియజేసింది. సియాచిన్ హిమనీనద ప్రాంతం సహా కోరాకోరం పర్వత శ్రేణుల మీదుగా ఈ కారిడార్ నిర్మించాలని చైనా సంకల్పిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన అమెరికా రక్షణ మంత్రి జిమ్ మ్యాటిస్‌‘ ప్రపంచంలో ఎన్నో బెల్ట్‌లు ఎన్నో రోడ్లు ఉన్నాయి. ఏ ఒక్క దేశం కూడా ఒకే బెల్టు ఒకే రోడ్డు అని ఇతర దేశాలను శాసించడానికి వీల్లేదు’అని అన్నారు. ఈ అంశంపై సెనేట్ సాయుధ సర్వీసుల కమిటీలో తన వాదనను వినిపించిన మ్యాటిస్ దీన్ని నిర్మాణం ఓ వివాదాస్పద ప్రాంతం మీదుగా సాగుతోందని, ఒక రకంగా మరోదేశంపై పెత్తనం చేసే ప్రయత్నమేనని అంటూ భారత్ వైఖరిని పరోక్షంగా బలపరిచారు.
ఓబిఓఆర్ నిర్మాణం ద్వారా చైనా తన పట్టును మరింతగా బిగించాలని ప్రయత్నిస్తోందని అలాగే తమ సముద్రజల ప్రయోజనాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.