అంతర్జాతీయం

ముగ్గురికి నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం, అక్టోబర్ 4: ప్రపంచ దేశాలను గడగడలాడించిన జికా వైరస్, అల్జిమీర్స్‌లకు దారితీసే జీవకణాలను అత్యంత సూక్ష్మ రీతిలో పరిశీలించేందుకు దోహదం చేసిన జాక్వెస్ డుబోషెట్, జావోచిమ్ ఫ్రాంక్ (జర్మనీ), రిచర్డ్ హెండర్‌సన్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
రసాయన శాస్త్రంలో వినూత్నమైన పరిశోధనలు జరిపి క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని అభివృద్ధి చేసినందుకు గాను వీరినీ ఉన్నత పురస్కారం వరించింది. అత్యంత సూక్ష్మమైన జీవ కణాలను గుర్తించడానికి ‘కూల్ మెథడ్’గా పేర్కొనే ఈ వినూత్న విధానం తోడ్పడుతుందని నోబెల్ అకాడమీ తెలిపింది. ఈ విప్లవాత్మక పద్థతి ద్వారా జీవ కణాలను ఘనీభవింపజేసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది.
అంతే కాకుండా కణాలు, వైరస్‌లు, ప్రొటీన్లకు సంబంధించి అత్యంత సూక్ష్మస్థాయి పరిశీలనలు జరిపేందుకూ దీని వల్ల వీలు కలుగుతుందని నోబెల్ కమిటీ వెల్లడించింది.

చిత్రం..రసాయన శాస్త్రంలో నోబెల్‌కు ఎంపికైన జాక్వెస్ డుబోషెట్, జావోచిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హ్యాండర్‌సన్