అంతర్జాతీయం

ఐకెన్‌కు నోబెల్ శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓస్లో, అక్టోబర్ 6: ఉత్తర కొరియా, ఇరాన్‌లు సృష్టిస్తున్న అణు సంక్షోభం నేపథ్యంలో అణు నిరాయుధీకరణ కోసం గత దశాబ్దకాలంగా అహరహరం శ్రమిస్తున్న ఓ ఎన్జీఓ బృందానికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచాన్ని అణుబాంబు నుంచి విముక్తం చేయాలంటూ ‘ఐకెన్’ సంస్థ అవిశ్రాంతంగా ప్రచారం జరుపుతోంది. అణ్వాయుధాల వినియోగం వల్ల ఎలాంటి భయానక విపరిణామాలు, మానవీయ సంక్షోభాలు తలెత్తే అవకాశం ఉందో తెలియజేసేందుకు ఈ సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషికి గుర్తింపుగానే ఈ శాంతి పురస్కారాన్ని అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ అధ్యక్షుడు బెరిట్ ఆండర్సన్ తెలిపారు. జపాన్ పట్టణాలైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి జరిగి 70 సంవత్సరాలు దాటిందని తాజాగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరుపుతున్న నేపథ్యంలో ఈ సంస్థ చేస్తున్న కృషికి గుర్తింపుగానే ఈ పురస్కారానికి ఎంపిక చేశామని ఆయన తెలిపారు. దాదాపు మూడువేలకు పైగా ఎన్జీఓలతో కూడిన ఐకెన్ సంస్థ 2007లో వియన్నాలో ఏర్పడింది. తన ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలను ఈ సంస్థ తీసుకుంది. అణు విపత్తు తలెత్తితే కలిగే విపరిణామాలను ప్రపంచం నలుచెరగులా పరివ్యాప్తం చేసే ప్రయత్నం చేసింది. జూలైలో 122 దేశాలు అణ్వాయుధ నిషేధ ఒప్పందంపై చారిత్రక రీతిలో సంతకాలు చేయడం వెనుక కూడా ఐకెన్ కృషి ఎంతో ఉంది. అయితే అణ్వాయుధాలు కలిగిన తొమ్మిది దేశాల్లో ఏ ఒక్క దేశమూ దీనిపై సంతకం చేయకపోవడం వల్ల ఆ ఒప్పందం మొక్కుబడి చందంగానే మారింది. నోబెల్ శాంతి పురస్కారంలో భాగంగా ఈ సంస్థకు బంగారు పతకం, 1.1 మిలియన్ డాలర్లను డిసెంబర్ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో అందిస్తారు.