అంతర్జాతీయం

మేం సంతకం చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 7: అంతర్జాతీయ అణ్వాయుధాల నిషేధ ఒప్పందంపై సంతకం చేసే ఉద్దేశం లేదని అమెరికా స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆ ఉద్దేశం లేదు. అణ్వాయుధాలకు సంబంధించి మా విధానం మారదు. అణ్వాయుధాల నిషేధం ఒప్పందానికి మద్దతు ఇవ్వడం లేదా సంతకం పెట్టడం జరగదు’అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు.‘ఈ ఒప్పందం వల్ల వొనగూరేదీ ఏమీ ఉండదు. ప్రపంచంలో ఒక్కసారిగా శాంతి నెలకొనదు. దానివల్ల ఒక్క అణ్వాయుధం వాడకం ఆగదు. ఒక్క దేశంలో విస్తరణ అడ్డుకోలేం’అని ఆయన కరాకండిగా చెప్పారు. అణు నిరాయుధీకరణ కోసం అవిరళ కృషి చేస్తున్న ‘ఐకెన్’ సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. అణ్వాయుధాల నిషేధంపై 122 దేశాలు ఓ ఒప్పందం చేసుకోవడం వెనక ఈ సంస్థ పాత్ర ఎంతో ఉంది. అయితే అణ్వాయుధాలు విస్తరంగా కలిగి ఉన్న తొమ్మిది దేశాల్లో ఒక్కటీ ఒప్పందంపై సంతకం చేయలేదు. జపాన్‌పై అణుబాంబు ప్రయోగంతోపాటు ఉత్తర కొరియా, ఇరాన్ సృష్టిస్తున్న అణుప్రకంపనలకు వ్యతిరేకంగా ఐకాన్ పోరాడుతోంది. ఒప్పందపై సంతకం చేయబోమని ప్రకటించిన అమెరికా‘అణ్వాయుధాల విస్తరణ జరుగకుండా, అంతర్జాతీయ భద్రతకు, అణు తీవ్రత తగ్గించడం, ప్రమాదాన్ని నివారించడం కోసం పాటుపడతాం’అని పేర్కొంది.