అంతర్జాతీయం

అల్లాడిస్తున్న ‘నేట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఓర్లాన్స్, అక్టోబర్ 8: వరుస తుపాన్ల బీభత్సంతో అమెరికా అల్లాడుతోంది. కొద్ది రోజుల క్రితమే మధ్య అమెరికాలో విధ్వంసాన్ని సృష్టించిన తీవ్ర హరికేన్ల నష్టాల నుంచి ప్రజలు తేరుకోకముందే, యుఎస్ గల్ఫ్ తీరాన్ని నేట్ హరికేన్ వణికిస్తోంది. తుపాను తీవ్రతవున్న ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలతో వణుకుతున్నారు. తుపాను విరుచుకుపడే ప్రదేశాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటూ అధికారులు చేస్తున్న హెచ్చరికలతో అలబామా, ఫ్లోరిడా, లూసియానా వాసులు బెంబేలెత్తుతున్నారు. గత రెండు నెలల కాలంలో ఈ ప్రాంతాలు మూడో హరికేన్‌ను ఎదుర్కొంటున్నాయి. మిసిసిపిలోని బిలాక్సికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నేట్ హరికేన్ కేంద్రీకృతమై ఉందని, ఈ తుపాను కారణంగా ఎతె్తైన సముద్రపు అలలు రెట్టించిన వేగంతో తీరాన్ని తాకే ప్రమాదం ఉందంటూ జాతీయ తుపాను హెచ్చరికల కేంద్రం (ఎన్‌హెచ్‌సి) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా తుపానును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర ప్రకటన జారీ చేశారు. సఫిర్- సింప్సన్ స్కేల్‌మీదుండే ఐదు పాయింట్లలో నేట్ హరికేన్ అత్యంత ప్రమాదకరమైన మొదటి పాయింట్ కిందకు వస్తుందని ఎన్‌హెచ్‌సి ప్రకటించింది. దీని ప్రభావంతో తీరంలో 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని, సముద్రలు అలలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆదివారం సాయంత్రానికి దక్షిణ రాష్ట్రాల మీదుగా నేట్ హరికేన్ తీరంతాకే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.