అంతర్జాతీయం

అమెరికా ఆర్థికవేత్తకు నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, అక్టోబర్ 9: అర్థశాస్త్ర నియమ నిబంధనలను మానవీయ కోణంలో ఆవిష్కరించే సరికొత్త ప్రవర్తనాత్మక కోణాన్ని వెలుగులోకి తెచ్చిన అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ తాలెర్‌కు 2017 సంవత్సరానికి గాను అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆర్థిక, ద్రవ్యపరమైన నిర్ణయాలు తీసుకునేవారంతా అన్ని వేళలా సహేతుకంగా ఉండరని, వారిలో మానవీయ కోణాలు తరచూ వెలుగుచూస్తాయని ఆయన సూత్రీకరించారు. మనస్తత్వ శాస్త్రానికి, అర్థశాస్త్రానికి మధ్య ఉన్న అగాథాన్ని తొలగిస్తూ ఆయన ప్రవర్తనాత్మక ఆర్థిక సూత్రాలను వెలుగులోకి తెచ్చారు. ఆర్థిక, వ్యాపార రంగాల్లో వ్యక్తులు లేదా సమూహాలు తీసుకునే నిర్ణయాల ప్రభావం మానసికంగా ఏవిధంగా ఉంటుంది,
సామాజికంగా దాని ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై రిచర్డ్ తాలెర్ ప్రశంసనీయ పరిశోధన చేశారు. అర్థశాస్త్రాన్ని మరింత మానవీయ కోణంలో వెలుగులోకి తెచ్చినందుకు గాను ఆయన్ని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు జ్యూరీ తెలిపింది. మానసిక శాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని సమదృష్టితో పరిశీలించడమే కాకుండా పరిమిత సహేతుకత, సామాజిక ప్రాధాన్యతలు, స్వీయ నియంత్రణ లేకపోవడం వల్ల ఎలాంటి విపరిణామాలు తలెత్తుతాయో కూడా ఆయన వెలుగులోకి తెచ్చినట్లు జ్యూరీ తెలిపింది. ఆయన చేసిన పరిశోధనల ఫలితంగానే ప్రవర్తనాత్మక ఆర్థిక వ్యవస్థ మరింతగా విస్తరిస్తోందని, విధానపరంగానూ పరిశోధనల్లో కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తోందని తెలిపింది.