అంతర్జాతీయం

పాక్‌ది పాడిందే పాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, అక్టోబర్ 10: అజెండాలో లేకపోయినా ఐరాస జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్ అంశాన్ని పదేపదే లేవనెత్తడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పొరుగుదేశంపై లేనిపోని ఆరోపణలు చేయడం ద్వారా చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారని పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలేహా లోధీపై భారత్ నిప్పులు చెరిగింది. ఐరాస ప్రతి సమావేశంలోనూ కాశ్మీర్‌పై పాక్ అవాస్తవాలు మాట్లాడుతోందని ఐరాసలో భారత శాశ్వత మిషన్ అధికారి శ్రీనివాస్ ప్రసాద్ ధ్వజమెత్తారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని అంశాన్ని అంతర్జాతీయ వేదికపై పదేపదే లేవనెత్తుతూ ప్రయోజనం పొందాలని చూస్తోందని విమర్శించారు. ఐరాసలో లోధీ చేస్తున్న ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవని అన్నారు. బుట్టదాఖలైన తీర్మానాలు ప్రస్తావిస్తూ అజెండాలో లేని అంశాలను పట్టుకుని వేలాడుతోందని ప్రసాద్ విరుచుకుపడ్డారు. అసలు సమస్యను పక్కనబెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందంటూ భారత్ ఎదురుదాడికి దిగింది. అంతకు ముందు జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన పాకిస్తాన్ అధికారి లోధీ జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని ఆరోపించారు. అక్కడ ప్రజల హక్కులు హరిస్తున్నారంటూ భారత్‌పై విమర్శలు చేశారు. సమస్య పరిష్కారంపై వారికి చిత్తశుద్ధిలేదని అనేక తీర్మానాలను భారత్ బేఖాతరు చేస్తోందని లోధీ పేర్కొన్నారు.