అంతర్జాతీయం

ఇమ్రాన్‌కు అరెస్టు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 12: ఎన్నికల కమిషన్‌పై అనుచిత ఆరోపణలు చేసిన పాకిస్తాన్ ప్రతిపక్షనేత, తెహ్రీక్ ఎ ఇన్ఫాస్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ చిక్కుల్లో పడ్డారు. జనవరి 24న మాజీ క్రికెటర్ ఖాన్‌కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం తమపై పక్షపాతం చూపుతోందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. ఖాన్ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సారథ్యంలో ఐదుగురు కమిషనర్ల బెంచ్ విచారించింది. ఈ నెల 26 విచారణ కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశించిన కమిటీ, 64 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తెహ్రీక్ ఎ ఇన్ఫాఫ్ అధ్యక్షుడు ఖాన్‌పై అరెస్టు వారెంట్ జారీ అయిందని జియో వార్త సంస్థ వెల్లడించింది. ఇలా ఉండగా ఇసి ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేస్తానని ఖాన్ ప్రకటించారు. కాగా ఇదే కేసులో గత నెల 14 ఎన్నికల సంఘం ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీన్ని తెహ్రీక్ పార్టీ 20న ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఇసిని ఉద్దేశించి చేసిన వ్యాఖలపై తన క్లయింట్ గతంలోనే క్షమాపణ కోరినందున వారెంట్ రద్దుచేయాలని ఖాన్ తరఫున న్యాయవాది బాబర్ అవాన్ కోర్టును అభ్యర్థించారు. ఇప్పుడు ఎలాంటి వివాదం లేదని, సమస్య పరిష్కారమైపోయిందని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ జారీచేసిన షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. విదేశీ విరాళాలకు సంబంధించిన కేసులో ఇసిపై ఇమ్రాన్‌ఖాన్ అంభ్యతరకరమైన వ్యాఖ్యలు చేశారు.