అంతర్జాతీయం

అంతా సానుకూలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 13: భారత్‌లో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలపై అమెరికాలో ప్రోత్సాహకరమైన అభిప్రాయం బలంగా నెలకొందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంతో పాటు ఇందుకు సంబంధించి సరళతరమైన విధానాలను అమలుచేయడం కూడా ఇందుకు ప్రధాన కారణమైందని తెలిపారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల విషయంలో అమెరికా మదుపుదారుల్లో గుణాత్మకమైన అవగాహన ఉందని, దీని దృష్ట్యా భవిష్యత్తులో భారత్‌లోకి విస్తృతంగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా బలపడుతోందని జైట్లీ అన్నారు. వారం రోజుల పర్యటనార్థం అమెరికా వచ్చిన ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల్లో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో పాల్గొంటున్నారు.
ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్‌లలో పర్యటించిన ఆయన అమెరికా ఇనె్వస్టర్ల నుద్దేశించి మాట్లాడారు. అలాగే అనేక కార్పొరేట్ సంస్థల సిఇఓలతోనూ చర్చలు జరిపి భారత్‌లో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని వారి దృష్టికి తెచ్చారు. కొలంబియా, హార్వర్డ్ యూనివర్శిటీ విద్యార్థులతో కూడా ముచ్చటించిన ఆయన భారత్‌లో మారుతున్న పరిస్థితుల గురించి, పెరుగుతున్న ఉపాధి అవకాశాల గురించి వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థను విస్తరించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలుచేస్తున్న సంస్కరణల పట్ల అమెరికా పెట్టుబడిదారుల్లో చాలా స్పష్టమైన అవగాహనే ఉందని, అదేవిధంగా భవిష్యత్ పట్ల కూడా వీరిలో బలమైన నమ్మకం కలిగిస్తుందని ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఫిక్కీ నిర్వహించిన ఓ సదస్సులో జైట్లీ స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా తాను ఇనె్వస్టర్ల సమావేశంలో మాట్లాడానని, వారినుంచి వచ్చిన ప్రతిస్పందనలన్నీ భారత్ పట్ల వారికి ఉన్న సానుకూల అభిప్రాయానికి అద్దం పట్టాయని తెలిపారు. గతానికి భిన్నంగా భారత్ అభివృద్ధి విషయంలో ఎదుగుదలకు సంబంధించి అమెరికా ఇనె్వస్టర్లలో చాలా స్పష్టమైన ఆలోచనలే ఉన్నాయని జైట్లీ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వ అధికారులనుంచి, అదేవిధంగా అమెరికా ఇనె్వస్టర్లనుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమైందని వివరించారు. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్, వాణిజ్యమంత్రి విల్బర్ రోస్‌లతో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై జైట్లీ చర్చలు జరిపారు. అదేవిధంగా రెండు దేశాలకు సంబంధించిన ఎన్నో కీలక అంశాలను చర్చించారు.