అంతర్జాతీయం

అబేకు తిరుగులేని మెజారిటీ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 22: జపాన్ ప్రధాని షింజో అబే ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధిస్తారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఆదివారంనాటి సార్వత్రిక ఎన్నికల్లో అబే పార్టీకి ఓటర్లు తిరిగి పట్టం కడతారని వారంటున్నారు. ప్రపంచంలోనే ఆర్థికంగా మూడో అతిపెద్ద దేశమైన జపాన్‌కు అబే పెద్దగా చేసిందేమీ లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కొరియా దూకుడును అడ్డుకట్టవేయగల శక్తి, సామార్థ్యాలు అబేకు ఉన్నాయని ప్రజలు విశ్వసించడమే ఎన్నికల్లో ఆయన గెలుపునకు మార్గం సుగమం చేస్తుందని పరిశీలకులు పేర్కొన్నారు. ప్రధాని షింజో అబే సారథ్యంలోని కన్జర్వేటీవ్ సంకీర్ణం దిగువ సభలో మూడింట రెండొంతుల స్థానాలు దక్కించుకుంటుదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దిగువసభకు అబే ఏడాది క్రితమే రద్దుచేసిన సంగతి తెలిసిందే. దేశ భద్రత విషయంలో షింజో ఎంతో విజ్ఞతతో వ్యవహరించారని ప్రైవేటు మీడియా సంస్థ టిబిఎస్ స్పష్టం చేసింది. క్షిపణుల దాడులు, అణ్వాయుధ పరీక్షలతో ఉత్తర కొరియా రెచ్చిపోతున్నా షింజో అబే ఎంతో సమయస్ఫూర్తిగా దాన్ని ఎదుర్కోవడంతోపాటు జఠిలమైన ఈ సమస్య పరిష్కారం చూశారని వారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అబే ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందన్న పేరు తెచ్చుకుంది. జపాన్‌లో ఇంతకుముందు పనిచేసిన ఏ ప్రధానికి దక్కనంత మద్దతు అబేకు లభించిందని పరిశీలకులు అంటున్నారు. దేశంలో అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ప్రజలు భారీగా తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.