అంతర్జాతీయం

భారత్‌కు ఇక ఆర్మ్‌డ్ డ్రోన్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 22: భారత్ తన వైమానిక దళంకోసం ఆర్మ్‌డ్ డ్రోన్లను సరఫరా చేయవలసిందిగా చేసిన విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అన్‌ఆర్మ్‌డ్ గార్డియన్ డ్రోన్లను భారత్‌కు విక్రయించడానికి కొన్ని వారాల క్రితమే అమెరికా ఆమోదం తెలిపింది. భారత్ తన సాయుధ బలగాల ఆధునీకరణలో భాగంగా ఆర్మ్‌డ్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ, విక్రయించాల్సిందిగా అమెరికాకు చేసిన విజ్ఞప్తి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ట్రంప్ పాలనా యంత్రాంగంలోని ఒక సీనియర్ అధికారి వద్ద ప్రస్తావించగా, ఆ విజ్ఞప్తిని అమెరికా పరిశీలిస్తున్నట్టు ఆయన బదులిచ్చారు. భారత వైమానిక దళం రక్షణ పాటవాన్ని పెంపొందించుకోవడానికి ఆర్మ్‌డ్ డ్రోన్లు ఉపయోగపడతాయ. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఈ సంవత్సరం జూన్ 26న వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిపిన చర్చల సందర్భంగా భారత్‌కు 22 అన్‌ఆర్మ్‌డ్ గార్డియన్ డ్రోన్లను విక్రయిస్తానని అమెరికా ప్రకటించింది. వ్యూహాత్మక హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం నిఘా సామర్థ్యాన్ని ఇవి పెంపొందించనున్నాయి.