అంతర్జాతీయం

షరీఫ్‌కు మళ్లీ వారెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 26: పనామా కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవీచ్యుతుడైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అకౌంటబిలిటీ కోర్టు మళ్లీ వారెంట్లు జారీచేసింది. రెండు కేసుల విచారణలో షరీఫ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి మహమ్మద్ బషీర్ వారెంట్లు జారీచేశారు. అలాగే కోర్టు హాజరునుంచి మినహాయింపు కోరుతూ షరీఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేశారు. కోర్టు ఇంతకుముందు ఇచ్చిన 15 రోజుల మినహాయింపు కూడా ఈ నెల 24తో ముగిసింది.
శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిన షరీఫ్ విదేశాల్లో ఉండటంతో తాజా వారెంట్లు జారీఅయ్యాయి. పనామా కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్, ఆయన పిల్లలు, అల్లుడిపైనా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబి) సెప్టెంబర్ 8న రెండు కేసులను రిజిస్టర్ చేసింది. షరీఫ్ కుమార్తె మరియమ్, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ ముహమ్మద్ సఫ్దర్ కోర్టుకు హాజరయ్యారు.
అయితే నవాజ్ షరీఫ్ సతీమణి ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 23న హుటాహుటిన లండన్‌కు వెళ్లారని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది ఖ్వాజా హారిస్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.