అంతర్జాతీయం

గంపెడు పిల్లలు... సరిపోని ఆవాసాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలొంగ్‌ఖలీ (బంగ్లాదేశ్), అక్టోబర్ 28: మైన్మార్ నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న రోహింగ్యా శరణార్థులకు సౌకర్యాలు కల్పించడంలో తలమునకలై ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం వారిలో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నదానిపై దృష్టిపెట్టింది. మైన్మార్‌లో ఆగస్టులో తలెత్తిన సైనిక చర్య తరువాత 6 లక్షల మందికి పైగా రొహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చేశారు. ఇప్పటికి రఖీనే రాష్ట్రం నుంచి శరణార్థులు వస్తునే ఉన్నారు. వందల దగ్గర మొదలైన రోహింగ్యా ముస్లింలు లక్షల్లోకి చేరుకుని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా కాక్స్ బజార్ నిండిపోయింది. రోహింగ్యాలకు ఆవాసం కల్పించడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇలాగే వదిలేస్తే రోహింగ్యాల జనాభా పెరిగిపోయి కొత్త సమస్యలొస్తాయని భావించిన అధికారులు కుటుంబ నియంత్రం ఆపరేషన్లు చేయించాలని, అవి కూడా వాలంటరీగానే అమలుచేస్తే ఫలితం ఉంటుందని నిర్ణయించారు. నియంత్రణ లేకపోతే కూడు, గుడ్డ, తిండికి మున్ముందు మరిన్ని అవస్థలు తప్పవని భావించి మెల్లమెల్లగా వారిలో అవగాహన కల్పించి తరువాత కు.ని శస్తచ్రికిత్సలకు వెళ్లొచ్చని నిర్ణయించారు. రోహింగ్యాల కుటుంబాలన్నీ పెద్దవే. 19 మంది సభ్యులున్న కుటుంబాలు అనేకం ఉన్నాయని సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షకుడు పింటు కాంతి భట్టాచార్జీ ల్లడించారు. మగవాళ్లకు ఇద్దరు, ముగ్గురేసి భార్యలు. అడ్డూఅదుపూలేని సంతానం. అయినా జిల్లా కుటుంబ సంక్షేమ అధికారులు అతికష్టం మీద గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు శరణార్థ శిబిరాలకు వెళ్లి అందించినా వాటిని వాడేందుకు రోహింగ్యాలు అయిష్టత చూపుతున్నారు. రోహింగ్యా స్ర్తిలు ఇస్లాంకు వ్యతిరేకమంటూ మాత్రలు తీసుకోడానికే నిరాకరిస్తున్నారని శరణార్థ శిబిరంలో పనిచేస్తున్న కుటుంబ సంక్షేమశాఖ వాలంటీర్ ఫర్షానా సుల్తానా తెలిపింది. కుటుంబ నియంత్ర మహాపాపం అని అనేక మంది తమతో అన్నారని ఆమె వెల్లడించింది. రఖీనేలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రోహింగ్యాలు వెళ్లిన దాఖలాలూ తక్కువే. అక్కడి వెళ్లే మైన్మార్ అధికారుల ఇచ్చే మందులు వేసుకుంటే ఆరోగ్యాలు పాడైపోతాయన్న భయం వారిలో ఉండేది. ఏది ఏమైనా వారిలో కుని అవగాహన ఆరోగ్యకార్యకర్తలకు కత్తిమీద సామే. పిల్లల పోషణ భారంగా తాము ఎప్పుడూ భావించలేదని ఏడుగురు బిడ్డల తల్లి సబురా పేర్కొంది. మరో దిగ్భ్రాంతికరమైన అంశం ఏమిటంటే గర్భంతో ఉంటే సైన్యం వదిలేస్తుందన్న మూఢ విశ్వాసంతోనూ రోహింగ్యా పురుషులు కు.నిపై దృష్టిపెట్టలేదని తెలిసింది. బంగ్లాదేశ్ అధికారుల లెక్కల ప్రకారం కాక్స్‌బజార్ శిబిరాల్లో ఇరవై వేల మంది గర్భిణీలున్నారు. ఈ మధ్య కాలంలో 600 మందికి డెలివరీ అయింది. చూసీ చూడనట్టు వదిలేస్తే వారి జనాభా పెరుగుదల అంతూపొంతూ లేకుండా పోతుందన్న ఆందోళన బంగ్లాదేశ్ ప్రభుత్వం కు.నిపై దృష్టి సారించింది.