అంతర్జాతీయం

అఫ్గాన్ డిప్యూటి గవర్నర్ కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, అక్టోబర్ 29: పాకిస్తాన్‌లోని ఖైబర్ పంఖ్తున్‌క్వా రాష్ట్రంలో అఫ్గానిస్తాన్‌కు చెందిన ఒక డిప్యూటి ప్రొవిన్షియల్ గవర్నర్ కిడ్నాప్‌కు గురయ్యారు. కునార్ ప్రావిన్స్ డిప్యూటి గవర్నర్, అఫ్గాన్ వార్‌లార్డ్ గుల్బుద్దీన్ హెక్మత్యార్‌కు చెందిన హిజ్బి ఇస్లామి నాయకుడు ఖాజి మొహమ్మద్ నబీ అహ్మది పెషావర్‌లోని దాబ్‌గరి ప్రాంతంలో శుక్రవారం కిడ్నాప్‌కు గురయినట్లు పెషావర్‌లోని అఫ్గాన్ కాన్సుల్ జనరల్ మొయిన్ మ్రాస్టియల్ తెలిపారు. గుర్తు తెలియని సాయుధులు అహ్మదిని కిడ్నాప్ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే అహ్మదిని తామే కిడ్నాప్ చేశామని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. వైద్య చికిత్స కోసం ఇక్కడికి వచ్చిన అహ్మది కిడ్నాప్‌కు గురికావడం కలకలం సృష్టించింది. అహ్మది కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి పెషావర్‌కు వచ్చారని అతని సోదరుడు హబీబుల్లా చెప్పారని ఓ పోలీసు అధికారిని ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక తెలిపింది. అయితే అహ్మది వద్ద పాస్‌పోర్ట్ కాని, ఇతర పత్రాలు కాని లేవని ఆ పోలీసు అధికారి వెల్లడించారు. గుర్తు తెలియని సాయుధులు కారులో తీసుకొని వెళ్లడానికి ముందు అహ్మది పెషావర్‌లోని వివిధ ప్రాంతాల్లో తిరిగారని ఆ పోలీసు అధికారిని ఉటంకిస్తూ డాన్ వివరించింది.