అంతర్జాతీయం

కూలిన సొరంగం..200 మంది సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 31: ఉత్తర కొరి యా అణు ప్రయోగం జరిపిన పుంగేరి ప్రాంతంలో సొరంగం కూలిపోయిన 200 మంది సమాధి అయ్యారు.
అక్టోబర్ 10 ఆ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయిందని జపాన్ టెలివిజన్ వెల్లడించారు. ముందు సొరంగంలో వంద మంది చిక్కుకున్నారు. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకునే సరికే మిగతా భాగం కుప్పకూలిలోయిందని అసాహీ టీవీ పేర్కొంది. ఈ దుర్ఘటనలో మొత్తం 200 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ప్రమాదంపై ఉత్తర కొరియా అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో అణు ప్రయోగం నిర్వహించారని దానివల్లే ఆ ప్రదేశం మొత్తం దెబ్బతిందని జపాన్ టివి స్పష్టం చేసింది. పుంగేరి వద్ద భూ ఉపరితలం వద్ద ఇలాంటి ప్రయోగాలు నిర్వహిండం ముప్పేనని నిపుణలు హెచ్చరించినా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లక్ష్యపెట్టలేదు. దీంతో ఈ ఉపద్రం వచ్చిపడిందని జపాన్ మిడియా ఆరోపించింది. ప్రయోగాలు జరిగే ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్వతాలపై నుంచి కొండ చరియలు విరిగిపడడం, రేడియేషన్ లీకవ్వడం వంటి దుష్ఫలితాలుంటాయని ముందే ఆందోళన వ్యక్తమైంది.