అంతర్జాతీయం

చిన్నారి షెరిన్‌కు అంత్యక్రియలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, నవంబర్ 1: డల్లాస్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మూడేళ్ల చిన్నారి షెరిన్ మాథ్యూస్‌కు ఆమె పెంపుడు తండ్రి రహస్యంగా అంత్యక్రియలు జరిపించాడు. మీడియా కంటపడకుండా నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని ఖనం చేశారు. అక్టోబర్ 7న అదృశ్యమైన మాథ్యూస్ 11 రోజుల తరువాత ఓ కల్వర్ట్ వద్ద శవమై కనిపించింది. ఆమె నివాసానికి కిలోమీటర్ దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం తరువాత షెరిన్ మృతదేహం గతవారం అప్పగించారు. అయితే పోస్టు మార్టం నివేదిక మాత్రం ఇంకా రాలేదు. ఇండియన్ అమెరికన్ దంపతులు వెస్లీ మాథ్యూస్, సిని మాథ్యూస్ చిన్నారిని దత్తత చేసుకున్నారు. గత ఏడాది భారత్‌లోని ఓ అనాధశరణాలయం నుంచి షెరిన్‌ను తెచ్చుకున్నారు. మత సంప్రదాయం ప్రకారమే చిన్నారికి అంత్యక్రియలు జరిపినట్టు న్యాయవాది మిట్చెల్ నొల్టే, గ్రెగ్ గిబ్స్ తెలిపారు. అయితే మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేసిందీ ఆయన రహస్యంగా ఉంచారు. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, కొద్ది మంది కుటుంబ సభ్యులు హాజరయ్యారని అన్నారు.