అంతర్జాతీయం

గ్రహాంతర వాసులు మనలాంటి వాళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 1: హాలీవుడ్ సినిమాలు, కాల్పనిక సైన్స్ సాహిత్యంలో గ్రహాంతర వాసులంటే వేరే ప్రపంచానికి చెందిన వారని, వికృతరూపంతో ఉంటారన్న వాదనలో నిజం లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. మనం భావిస్తున్న దానికి భిన్నంగా- గ్రహాంతర వాసులు మనుషులనే పోలి ఉంటారని పరిశోధకులు ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీ’లో పేర్కొన్నారు. పరిణామక్రమ సిద్ధాంతం గ్రహాంతర వాసుల ప్రవర్తనకు సంబంధించి తగిన అవగాహన కల్పిస్తుందని పరిశోధకులు ప్రకటించారు. మానవ ఆకృతికి సంబంధించిన ప్రక్రియలు, సంవిధానం వంటివి గ్రహాంతరవాసుల్లోనూ కనిపిస్తాయని వారు సూత్రీకరిస్తున్నారు. ‘గ్రహాంతర వాసులకు సంబంధించి కచ్చితమైన అంచనాలు వేయడం కష్టమే, భూతలంపై ఉన్న జీవుల గురించి మాత్రమే మనకు తెలుసు, ఆస్ట్రోబయాలజీ చాలా విస్తృతమైనది, భూమిపై మనం చూసే వాటికంటే విభిన్నమైనవి చాలా ఉన్నాయి..’ అని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ జీవశాస్త్ర పరిశోధకుడు శామ్ లెవిన్ చెబుతున్నారు. మనకు తెలిసిన రసాయన శాస్త్రం, భూగర్భశాస్త్రం, భౌతికశాస్త్రం ఆధారంగా గ్రహాంతర వాసుల గురించి అంచనాలు వేస్తామని, అయితే మరో ప్రత్యామ్నాయ మార్గంలో కొత్తగా అధ్యయనం చేయడం వల్ల అనేక వివరాలు తెలుస్తాయని పరిశోధకులు తెలిపారు. గ్రహాంతర వాసులకు డిఎన్‌ఎ ఉండదని, వారు నైట్రోజన్‌ను పీలుస్తారని, సిలికాన్ కలిగి ఉంటారని అనేక అంచనాలు, అపోహలు ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. భూమి మీద పుట్టిపెరిగే జీవుల పరిణామ క్రమం, అంతరిక్షంలో ఎదురయ్యే సమస్యలు తదితర విషయాలపై కూడా పరిశోధకులు తమ దృష్టి సారించారు. గ్రహాంతర వాసుల ఆకృతికి సంబంధించి కూడా అనేక ఆసక్తికరమైన అంచనాలున్నాయని వారు తెలిపారు. గ్రహాంతర వాసులు రెండు కాళ్లపై నడుస్తారా? విశాలమైన పచ్చటి నేత్రాలను కలిగి ఉంటారా? అన్న విషయాలపై ప్రస్తుతానికి తాము ఏమీ చెప్పలేమని అంటున్నారు. పరిణామక్రమ సిద్ధాంతం గ్రహాంతర వాసులకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రాతిపదికపై ఇప్పటికే తాము కొన్ని బలమైన అంచనాలకు రాగలిగామని వారు స్పష్టం చేస్తున్నారు.