అంతర్జాతీయం

చిన్నారులను చిదిమేసిన రక్తపిపాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, నవంబర్ 6: వారంతా దైవ సన్నిధిలో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న సమయం.. తుపాకీ చేతబట్టి ఓ దుండగుడు సృష్టించిన నరమేధంతో ఒక్క క్షణంలోనే అక్కడ హాహాకారాలు.. ఉన్మాది సృష్టించిన బీభత్సంతో ఘనీభవించిన విషాదం.. ఇదీ అమెరికాలోని టెక్సాస్ చర్చిలో కనిపించిన విషాదకర దృశ్యం.. టెక్సాస్ సుదెర్లాండ్ స్ప్రింగ్స్ వద్ద ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనల సమయంలో ఆగంతకుడు డేవిన్ పాట్రిక్ కెల్లీ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోగా, ఇందులో 14 మంది పిల్లలే కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో అమెరికా వాయుసేనలో పనిచేసి ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైన డెవన్ ఇంతటి ఘాతుకానికి ఎందుకు తెగించాడో అన్నది ఇంకా వెల్లడికాలేదు. ఇతనికి ఉగ్రవాదులతో సంబంధం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 5 నుంచి 72 ఏళ్లలోపువారు ఉన్నారు. అధిక సంఖ్యలే పిల్లలే కాదు, గర్భిణితోపాటు చర్చి పాస్టర్ కుమార్తె (14) మరణించడంతో స్థానికులు విషాదం నుంచి తేరుకోలేక పోతున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన ఇరవై మందిని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆగంతకుడు కాల్పులు జరిపినపుడు చర్చిలో సుమారు ఏభై మంది ప్రార్థనల్లో నిమగ్నమై ఉన్నారు. మృత్యువాత నుంచి బయటపడ్డవారంతా ఎంతో కొంత గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, టెక్సాస్ చరిత్రలోనే ఇంతమంది తూటాలకు బలికావడం గతంలో ఎన్నడూ జరగలేదని గవర్నర్ గ్రెగ్ అబ్బట్ ఆవేదన వ్యక్తం చేశారు. చర్చికి దూరంలో ఓ వాహనంలో ఆగంతకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించినప్పటికీ, అతడు ఎలా మరణించాడన్న విషయమై మీడియాలో విభిన్న కథనాలు చోటుచేసుకున్నాయి. దుండగుడి ఘాతుకానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు తమకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఇదే చర్చికి తరచూ వచ్చే డేవిన్ అత్తింటివారు సంఘటన జరిగిన రోజున మాత్రం రాలేదని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగుడు ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశాడని, అతనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నామన్నారు. హంతకుడు ఎలా మరణించాడన్న విషయమై వాస్తవాలను తెలుసుకునేందుకు విచారణ జరుగుతోందని, మృతదేహాలను పోస్టుమార్టంకు పంపామని టెక్సాస్‌లోని ప్రజా భద్రత విభాగం అధికారులు తెలిపారు. హంతకుడిని 26 ఏళ్ల డేవిన్ పాట్రిక్ కెల్లీగా గుర్తించారు. శాన్ అంటానియాలోని కోమెల్ కౌంటీకి చెందిన దుండగుడు డేవిన్‌ను 2014లో అమెరికా ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు పంపేశారని అధికారులు చెబుతున్నారు. డేవిన్ న్యూ మెక్సికోలోని హొలొమెన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో 2010 నుంచి విధుల నుంచి తొలగింపబడే వరకూ పనిచేశాడని అంటున్నారు. అయితే ఇతని సర్వీస్‌కు సంబంధించి సమాచారాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇంకా బయటపెట్టలేక పోతున్నారు. ఇతడిని 2014 మేలో ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు పంపేశారని కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. చర్చిలో ప్రార్థనలు జరుపుతున్న వారిపై కాల్పులు జరిపి, ఇంతమందిని ఇతను ఎందుకు హతమార్చాడన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

చిత్రాలుకాల్పులు జరిగిన టెక్సాస్ సుదెర్లాండ్ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చి.
*కాల్పులకు పాల్పడిన దుండగుడు డేవిన్ పాట్రిక్ కెల్లీ (ఇన్‌సెట్)