అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, నవంబర్ 11: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై శనివారం దాడి జరిగింది. ఓ గ్రామంలో హిందువుల ఇళ్లకు మెజారిటీ మతానికి చెందిన నిరసనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రంగ్‌పూర్ జిల్లా ఠాకూర్‌పురా గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇక్కడ హిందూ మతానికి చెందిన ఓ యువకుడు ‘ఫేస్‌బుక్’లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టాడని ఆగ్రహించిన మరో మతానికి చెందినవారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా బయలుదేరిన నిరసనకారులు హిందువుల ఇళ్లకు నిప్పంటించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువును ప్రయోగించగా ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఠాకూర్‌పురాకు చెందిన ఓ యువకడు కొద్ది రోజుల క్రితం తమను కించపరచేలా ‘ఫేస్‌బుక్’లో పోస్ట్ పెట్టాడని నిరసనకారులు చెబుతున్నారు. ఆరు, ఏడు గ్రామాలకు చెందిన నిరసనకారులు ఠాకూర్‌పురాకు చేరుకుని అక్కడ విధ్వంసం సృష్టించారు. నిప్పు పెట్టడంతో హిందువులకు చెందిన సుమారు 30 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగి, విధ్వంసకాండతో సంబంధం ఉందన్న ఆరోపణలపై 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాకపోకలకు అంతరాయం కలిగించడంతో రంగ్‌పూర్- దినాజ్‌పూర్ రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.