అంతర్జాతీయం

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు చతుర్ముఖ కూటమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, నవంబర్ 12: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా జట్టు కడుతున్నాయి. భద్రతారంగంలో సహకారానికి ఒక రూపం ఇవ్వడానికి ఈ నాలుగు దేశాలు ఆదివారం తొలిసారి అధికారుల స్థాయి చర్చలు జరిపాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోకి ఎవరయినా ప్రవేశించేందుకు వీలుగా స్వేచ్ఛా ప్రాంతంగా చేయాలనే అంశంపై కేంద్రీకరించి ఈ చర్చలు సాగాయి. ఈ ప్రాంతంలో చైనా తన సైన్యాన్ని విస్తరిస్తుండటం, దూకుడుగా వ్యవహరిస్తుండటం వల్ల దాన్ని తిప్పికొట్టేందుకు ఈ నాలుగు దేశాలు సమాయత్తం అవుతున్నాయి. అందుకే అధికారుల స్థాయి సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సమావేశం తరువాత భారత్, ఆస్ట్రేలియా, జపాన్ విడివిడిగా ప్రకటనలు విడుదల చేశాయి. తమ చర్చల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందని, వ్యూహాత్మకంగా ముఖ్యమయిన ఈ ప్రాంతంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించడానికి, నియమాల ఆధారిత క్రమాన్ని నెలకొల్పేందుకు సహకారాన్ని విస్తరించుకోవడానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాయి. మంగళవారం ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం జరుగనున్న తరుణంలో ఈ నాలుగు దేశాల మధ్య అధికారుల స్థాయి చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్లు, దక్షిణ చైనా సముద్రంలో చైనా మిలిటరీ విస్తరణ వంటి అంశాలు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలోనూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సంపన్నతలను పెంపొందించేందుకు సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.