అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, నవంబర్ 14: ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పనిచేయాలని భారత్-్ఫలిప్పీన్స్ నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూర్టేతో నాలుగు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రక్షణ రంగం, భద్రత వంటి విషయాల్లో పరస్పర సహకారం పంచుకోవాలని నిర్ణయించారు. ‘ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు సమష్టిగా పనిచేద్దాం. దీనిపై పరస్పర సహకారం అందించుకుందాం’ అని మోదీ, రోడ్రిగో స్పష్టం చేశారు. వ్యాపార, వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షి సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం కావాలని, సూక్ష్మ, చిన్న పరిశ్రమ రంగంతో పాటు వ్యవసాయం రంగం అభివృద్ధికి కలిసి పనిచేయాలని రోడ్రిగో, మోదీ నిర్ణయించారు. ఫిలిప్పీన్స్‌లోని ఫార్మా రంగంలో భారత పెట్టుబడులపై అధ్యక్షుడు సంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ కంపెనీల సహాయ సహకారాలు మున్ముందు మరింత పెరగాలని కోరారు.