అంతర్జాతీయం

ఇద్దరమొకటై చేయికలిపితే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/మనీలా, నవంబర్ 14: ఇండో ఫసిఫిక్ ప్రాంతాన్ని శాంతిమండలంగా తీర్చిదిద్దేందుకు భారత్, అమెరికా మరింత సంఘటితంగా ముందుకు సాగాలని సంకల్పించాయి. ఇందులో భాగంగా వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ప్రత్యేక దృష్టి పెట్టారని వైట్‌హౌస్ తెలిపింది. అదేక్రమంలో ఈ రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలూ అదేస్థాయిలో విస్తృతస్థాయి సైనిక దళాలనూ పెంపొందించుకోవాలన్న ఆకాంక్షనూ ఇరువురు నేతలూ వ్యక్తం చేశారని పేర్కొంది. ముఖ్యంగా ఇండో-్ఫసిఫిక్ ప్రాంతాన్ని శాంతిమండలంగా తీర్చిదిద్దడంతోపాటు అన్ని రకాల అభివృద్ధికీ కృషి చేయాలని ఇద్దరు నేతలు సంకల్పించారని వివరించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి అదేవిధంగా రక్షణ భాగస్వామ్యాన్నీ ఇరు దేశాలు పెంపొందించుకోవాలని, అదేస్థాయిలో నిరుపమానమైన రీతిలో సైనిక బలగాలనూ ఇనుమడింప చేసుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్టుగా ఆ ప్రకటనలో వివరించింది. ఇటీవలికాలంలో అమెరికా నుంచి భారత్ చమురు కొనుగోలు పది మిలియన్ బ్యారెళ్లు దాటడాన్ని ప్రశంసించిన ట్రంప్, ఇరు దేశాల మధ్య బలమైన ఇంధన సహకారం పెంపొందించగలమన్న నమ్మకాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంపై అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య తొలి సమావేశం జరిగిన అనంతరం ట్రంప్, మోదీలు చర్చించారని, ఆ సందర్భంగానే అనేక అంశాలపై విస్తృతస్థాయిలో మంతనాలు సాగించారని వైట్‌హౌస్ వివరించింది. మొత్తం ఆసియా ప్రాంతంలోనే వ్యూహాత్మక సంబంధాలపై మోదీ, ట్రంప్‌లు లోతైన అవగాహనతో చర్చలు జరిపారని భారత్ విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ వెల్లడించారు. అయితే,
ద్వైపాక్షిక చర్చలపై మోదీ ఆనందం
‘ఆసియాన్’ శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ మూడోరోజు మంగళవారం వివిధ దేశాధినేతలతో విస్తృతంగా ద్వైపాక్షిక చర్చలతో గడిపారు. జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్‌తో ఆయన కీలక చర్చలు జరిపారు. గ్లోబల్ పార్టనర్‌షిప్ పైన, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు రూపొందించాల్సిన సరికొత్త వ్యూహాలపైన ఆయన వివిధ దేశాధినేతలతో తన మనోభావాలను పంచుకున్నారు. ‘ఆసియాన్’ సదస్సు రెండోరోజున వియత్నాం ప్రధాని నుయెన్ క్సున్ ఫుక్‌తో, బ్రూనే సుల్తాన్ హస్సనల్ బోల్కై, న్యూజిలాండ్ ప్రధాని జసిన్డా ఆర్డెర్న్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ దేశాధినేతలతో జరిపిన చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర భద్రత వంటి కీలక అంశాలపై సమాలోచనలు జరిపారు.
జపాన్ ప్రధాని అబేతో చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై దృష్టిసారించినట్టు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో చర్చలు ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేశాయని మోదీ ప్రకటించారు. మోదీతో జరిపిన చర్చల వల్ల భద్రత, ఆర్థిక సహకారం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలకు సంబంధించి ఆశావహ ఫలితాలు ఉంటాయని టర్న్‌బుల్ ప్రకటించారు. వియత్నాం ప్రధానితో జరిపిన చర్చలు కూడా ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలకు ఎంతగానో దోహదం చేస్తాయని మోదీ ‘ట్వీట్’ చేశారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై సార్వభౌమాధికారం తనదేనని చైనా ప్రకటిస్తూ ‘విస్తరణ కాంక్ష’ను తీవ్రతరం చేస్తోంది. కానీ, ‘ఆసియాన్’లో సభ్య దేశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనే మాత్రం చైనా వాదనను తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీల చొరవ తమకు మేలు చేస్తుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టం, సముద్రాలకు సంబంధించి 1982 నాటి ఐరాస తీర్మానం అమలు చేస్తూ దక్షిణ చైనా సముద్రంలో ఆంక్షలు, ఆధిపత్య పోరాటం ఉండరాదని భారత్ సైతం భావిస్తోంది. న్యూజిలాండ్, బ్రూనే దేశాధినేతలతో జరిపిన ద్వైపాక్షిక చర్చల పట్ల కూడా మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
చైనా ప్రధానితో కాసేపు..
మనీలాలో ‘తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు’ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా ప్రధానమంత్రి లీ కెక్వింగ్‌తో కొద్దిసేపు మాట్లాడారు. ఇటీవలి కాలంలో భారత్, చైనాల మధ్య కొన్ని వివాదాలు రాజుకున్న నేపథ్యంలో ఇరు దేశాల నేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు, ఇతర దేశాల నిరసనలు వంటి అంశాలతో పాటు వాణిజ్యం, భద్రత వంటి విషయాలపైన ‘తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు’లో భారత్ వైఖరిని మోదీ స్పష్టం చేశారు.