అంతర్జాతీయం

కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, నవంబర్ 24: ముంబ యి దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ మరోసారి భారత్‌పై విషం కక్కారు. గృహ నిర్బంధం నుంచి గురువారం అర్ధరాత్రి విడుదలైన వెంటనే ఆయన కాశ్మీర్ అంశాన్ని అందిపుచ్చుకుని భారత్ వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విముక్తి కోసం ప్రజలను సమీకరిస్తానని హెచ్చరించారు. మరోపక్క మరే కేసులోనూ సరుూద్‌ను నిర్బంధంలోకి తీసకునే ప్రసక్తి లేదని పాకిస్తాన్ తెగేసి చెప్పడంతో భారత వ్యతిరేక వ్యాఖ్యలతో ఆయన మరింతగా రెచ్చిపోయారు. మరికొన్ని గంటల్లో 26/11 ఉగ్రదాడి 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో దానికి పన్నాగం పన్నిన హఫీజ్ సరుూద్‌ను భారత్ డిమాండ్ ప్రకారం శిక్షించాల్సింది పోయి పాక్ ప్రభుత్వం ఆయనను విడుదల చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 166 మంది మరణానికి కారణమైన ముంబయి దాడి కుట్రదారులను విచారించి శిక్షించాలని భారత్ అనేక మార్లు డిమాండ్ చేసినా పాక్ పెడచెవిన పెట్టింది. ముఖ్యంగా జమాత్ ఉద్ దవా అధినేత సరుూద్, అలాగే లష్కరే తోయిబా కమాండర్ లఖ్వీలను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేయడంతో పాటు ముంబయి దాడులకు సంబంధించి ఈ ఇద్దరి ప్రమేయాన్ని తిరుగులేని రీతిలో రుజువు చేసే ఆ సాక్ష్యాధారాలను కూడా పాక్‌కు భారత్ అందించింది. పది నెలల గృహనిర్బంధం నుంచి విడుదలైన సరుూద్ తన ఇంటిముందే మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. ‘కాశ్మీర్ విముక్తి పోరాటాన్ని కొనసాగించి తీరతా.. ఇందుకోసం దేశ ప్రజల మద్దతును సమీకరిస్తా.. ఆ విధంగా కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛా లక్ష్యాన్ని సాకారం చేస్తా..’ అని ప్రకటించారు. మరోపక్క సరుూద్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పాక్ ప్రభుత్వానికి అమెరికా విజ్ఞప్తి చేసింది. భారత్ కూడా ఈ పరిణామంపై ఇప్పటికే తీవ్రంగా స్పందించడంతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాద విధానానికి సరుూద్ విడుదల తిరుగులేని తార్కాణమని ధ్వజమెత్తింది.