అంతర్జాతీయం

ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 25: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో భద్రతా దళాలపై శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా, మరో 19 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రాష్ట్ర రాజధాని క్వెట్టాలోని సరియబ్ రోడ్డు మీదుగా వెళ్తున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు
పేర్కొంటూ, ఇది ఆత్మాహుతి దాడేనని నిర్ధారించారు. కాన్వాయ్‌లోని ఎఫ్‌సీ కమాండర్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, అయితే ఆ సమయంలో ఆయన ఆ వాహనంలో లేరని ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.