అంతర్జాతీయం

రాజకీయాలను శాసించడమే సరుూద్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 25: ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్- ఉద్ దవా అధిపతి హఫీజ్ సరుూద్ పాక్ రాజకీయాల్లో తీవ్రవాదాన్ని చొప్పించి ఆ దేశంపై ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆరాటపడుతున్నట్లు అమెరికా గూఢచారి సంస్థ ‘సిఐఏ’ మాజీ డిప్యూటీ డైరెక్టర్ మైకేల్ మోరల్ అన్నారు. ఉగ్రవాద చర్యలతో నరమేధం సృష్టిస్తున్న సరుూద్ తలపై అమెరికా ప్రభుత్వం పది మిలియన్ల డాలర్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడైన ఇతడిని గృహనిర్బంధం నుంచి పాక్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మైకేల్ మోరెల్ ట్విట్టర్‌లో సరుూద్ దుశ్చర్యలను పేర్కొన్నారు. గతంలో లష్కరే తోయిబా, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో కలసి పనిచేసిన సరుూద్ జమాత్-ఉద్ దవా అధిపతిగా అవతరించాక రక్తదాహం తీర్చుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ‘రక్తంతో చేతులు తడుపుకున్న ఈ ఉగ్రవాది పాక్ రాజకీయాలను శాసించేందుకు తీవ్రవాదాన్ని చొప్పిస్తున్నాడు..’ అని పేర్కొన్నారు.
సరుూద్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా అమెరికా, ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. గత జనవరి నుంచి 297 రోజులపాటు గృహనిర్బంధంలో ఉన్న సరుూద్‌ను పాక్ విడుదల చేయడం పట్ల మైకేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ముంబయి పేలుళ్లలో 166 మంది మరణించగా మృతుల్లో ఆరుగురు అమెరికన్లు ఉన్నారని ఆయన తెలిపారు. సరుూద్‌ను తిరిగి అరెస్టు చేసి, వివిధ నేరారోపణలపై అతడిని విచారించాలని అమెరికా పాక్‌ను కోరింది. సరుూద్‌ను విడుదల చేయడంతో పాక్‌లోని జిహాదీలు మరింతగా రెచ్చిపోతారని ఉగ్రవాద బృందాలపై విశే్లషణలు చేసే క్రిస్టేన్ ఫెయిర్ అన్నారు. సరుూద్ విడుదల ప్రభావం పాక్, అమెరికా సంబంధాలపై పడుతుందని ఎన్‌బిసి వార్తా సంస్థ వ్యాఖ్యానించింది.