అంతర్జాతీయం

విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వేగాస్ (అమెరికా), నవంబర్ 27: దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన ముద్దుగుమ్మ మరోసారి ‘విశ్వసుందరి’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల డెమి-లేహ్- నెల్ పీటర్స్‌ని ‘విశ్వసుందరి’గా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. 1978లో
దక్షిణాఫ్రికాకు చెందిన యువతి ‘విశ్వసుందరి’ గౌరవాన్ని దక్కించుకోగా, నలభై ఏళ్ల తర్వాత అదే దేశానికి చెందిన డెమి ఇప్పుడు ఆ ఘనతను సాధించింది. చివరి దశ పోటీల్లో మొత్తం 92 మంది ముద్దుగుమ్మలు కిరీటం కోసం తలపడగా, అందరినీ వెనక్కి నెట్టేసి డెమి ‘విశ్వసుందరి’గా నిలిచింది. ఈ పోటీల్లో కొలంబియాకు చెందిన లారా గొంజాలెజ్ ఫస్ట్ రన్నర్ అప్‌గా, జమైకాకు చెందిన డెవీనా బెనె్నత్ రెండో రన్నర్ అప్‌గా నిలిచారు. భారత్‌కు చెందిన శ్రద్ధా శశిధర్‌కు ‘టాప్ టెన్’లో కూడా స్థానం దక్కలేదు. కొద్దిరోజుల క్రితం భారత్‌కు చెందిన వైద్య విద్యార్థిని మానుషి చిల్లర్ ‘ప్రపంచ సుందరి’గా నిలవడంతో, ఇపుడు ‘విశ్వసుందరి’ పోటీలో శ్రద్ధా శశిధర్ ప్రతిభ కనబరుస్తుందని, దీంతో రెండు కిరీటాలు భారత్‌కే దక్కుతాయని చాలామంది ఆశపడ్డారు. అయితే, ఆ అంచనాలన్నీ తలకిందులై శ్రద్ధా కపూర్ 16వ స్థానంలో నిలిచింది.