అంతర్జాతీయం

అతివాదులకు తలొగ్గిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 27: పాకిస్తాన్‌లో అతివాద మత గ్రూపుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గడంతో న్యాయ శాఖ మంత్రి జహీద్ హమీద్ సోమవారం పదవి నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వం దిగిరావడంతో అతివాదులు తమ హింసాత్మక ఆందోళనలను ఉపసంహరించుకున్నారు. ఈ ఆందోళనల్లో ఆరుగురు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. న్యాయ శాఖ మంత్రి ఆదివారం రాత్రి తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి షాహిద్ ఖకన్ అబ్బాసీకి సమర్పించినట్టు, హమీద్ రాజీనామాను ప్రధాని సోమవారం ఆమోదించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను ముట్టడించిన అతివాద మత గ్రూపులు తమ ఆందోళనను ఉపసంహరించుకోవడాకి ఉన్న ఆటంకాలు హమీద్ రాజీనామాతో తొలగిపోయాయి. ఎన్నికల చట్టం- 2017లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి తీసుకొచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ, న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని అతివాద ఇస్లాం మత గ్రూపులు హింసాత్మక ఆందోళనలకు పూనుకోవడం తెలిసిందే. ఈ హింసాత్మక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి, చివరకు రాజధాని ఇస్లామాబాద్ ముట్టడికి దారితీశాయి. ఈ సందర్భంగా శనివారం భద్రతా దళాలకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరగడం, ఈ ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందిన తరువాత న్యాయ శాఖ మంత్రి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అతివాదుల ఆందోళనలతో రాజధాని ఇస్లామాబాద్ మూడు వారాల పాటు స్తంభించిపోయింది.