అంతర్జాతీయం

మైత్రీ బంధం మరింత ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: అమెరికాతో భారత్ సంబంధాలు మరో మెట్టుపైకి వెళ్లేందుకు వీలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ, శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్‌ల చర్చలు ఫలప్రదం అయ్యాయి. హైదరాబాద్‌లో మంగళవారం నాడు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఇవాంక ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఏడాది క్రితమే ఇవాంక హైదరాబాద్ రాక ఖరారు కావడం, అనంతరం పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇవాంక రాకపై ట్వీట్లు చేయడం, ఇవాంకతో చర్చలు జరపనున్నట్టు కూడా ప్రధాని ప్రకటించడంతో వారి చర్చలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు, మరో పక్క ఎస్పీజీ బృందాల భద్రతా పర్యవేక్షణ మధ్య హెచ్‌ఐసిసిలోని నోవాటెల్‌లో ఇరువురు సమావేశమయ్యారు. మరో పక్క విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లు వేర్వేరుగా ఇవాంకతో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన చర్చల్లో ప్రధానంగా అమెరికాతో సంబంధాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. రక్షణ, భద్రత రంగాల్లో ప్రపంచ స్థాయి భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్యం, నూతన భారత్ ఆవిర్భావానికి తోడ్పాటు, ఇరు దేశాల పౌరుల మధ్య సంబంధాలు, విశ్వవ్యాప్తంగా పొంచి ఉన్న సవాళ్లు, ప్రపంచ ఆరోగ్య భద్రత అజెండా అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. వీటిపై మరింత విస్తృతంగా అధికారుల స్థాయిలోనూ, మంత్రుల స్థాయిలోనూ మున్ముందు చర్చలు జరగనున్నాయి. త్వరలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇవాంకతో చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్‌కు వచ్చినందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆమెను అభినందించగా, భారత్ ప్రధానిని సైతం ఇవాంక అభినందనలతో ముంచెత్తారు. దేశంలో ఇటీవలి కాలంలో తీసుకున్న ఆర్ధిక సంస్కరణలను ప్రస్తావిస్తూ ప్రధానికి కితాబు ఇచ్చినట్టు తెలిసింది.

చిత్రం..ఇవాంకతో ప్రధాని నరేంద్రమోదీ చర్చలు