అంతర్జాతీయం

సూకీతో పోప్ ఫ్రాన్సిస్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగాన్, నవంబర్ 28: పోప్ ఫ్రాన్సిస్ మైన్మార్ పర్యటన సందర్భంగా మంగళవారం ఇక్కడ నోబెల్ అవార్డు గ్రహీత అంగ్‌సాన్ సూకీతో భేటీ అయ్యారు. రోహింగ్యా ముస్లిం శరణార్థుల అంశంపై ఇరువురి మధ్య చర్చ సాగింది. రోహింగ్యాలపై దాడులను ఐరాస సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఖండిస్తున్న నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రోహింగ్యాలపై సైనిక అణచివేతపై సూకీ నోరువిప్పడం లేదని మైన్మార్ కేథలిక్ నాయకులు ఆరోపిస్తున్నారు. రోహింగ్యాలపై జరిగిన దాడులు లాంటివే భవిష్యత్‌లో మిగతా మైనారిటీలపై జరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైన్మార్ రాజధాని నైపీడాకు సోమవారం విచ్చేసిన పోప్ ఫ్రాన్సిస్ ఈ అణచివేతకు సారధ్యం వహించిన కమాండర్ జనరల్ మిన్ అంగ్ హైయింగ్‌తో భేటీ అయ్యారు. స్పెషల్ ఆపరేషన్స్ బ్యూరోకు చెందిన ముగ్గురు సభ్యులూ సమావేశంలో పాల్గొన్నారు. అయితే పోప్ భేటీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని మర్యాద పూర్వకంగా కలిశారని వాటికన్ వర్గాలు వెల్లడించాయి. శాంతి, సమైక్యత, సమన్యాయం కోసం జరిగే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని జనరల్ మిన్ అంగ్ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

చిత్రం..యాంగాన్‌లో మంగళవారం అంగ్‌సాన్ సూకీతో సమావేశమైన పోప్ ఫ్రాన్సిస్