అంతర్జాతీయం

బలహీనంగా పాక్ సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 1: పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందని అమెరికా అభిప్రాయపడింది. కొద్దిరోజుల క్రితం పాక్‌లో రెచ్చిపోయిన మతవ్ఢ్యౌ పార్టీలను నియంత్రించటంలో ఆర్మీ అనుసరించిన విధానం వారికి మరింత ఊతమిచ్చేలా ఉందని ట్రంప్ యంత్రాంగంలోని ఓ సీనియర్ అధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దైవదూషణ అభియోగాలు ఎదుర్కొంటున్న న్యాయ శాఖా మంత్రి జహీద్ హమీద్ రాజీనామా చేయడంతో, నిరసనకారులు ఆందోళనలను విరమించడాన్ని బట్టి చూస్తే, దీనివెనుక సైన్యం హస్తం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే, దేశంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఆరుగురు పౌరుల మృతి, వందలమంది గాయపడిన ఘటనను నియంత్రించడానికి ఆర్మీ చూపిన చొరవ దారుణంగా ఉందంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించడం, పాక్ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో చెప్పకనే చెబుతోందన్నారు. ‘పాక్ మిలటరీ, ఆందోళనకు దిగిన మతవ్ఢ్యౌ పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో పరిశీలిస్తూనే ఉన్నాం. అల్లర్లను నియంత్రించడానికి ఆర్మీ ఎలాంటి ఉదాసీన పాత్ర పోషించిందో మాకు అర్థమైంది. వాళ్ల చర్య తీవ్రవాదులను బలోపేతం చేసేదిగాను, వారిలో ధైర్యం నింపేదిగాను ఉంది’ అని ఆ అధికారి పిటిఐకి వెల్లడించారు. ‘ప్రస్తుత ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉంది. ఆ విషయాన్ని ఈమధ్యే జరిగిన అల్లర్లు రుజువు చేశాయి’ అని వ్యాఖ్యానించారు. నిజానికి పాక్‌లో అల్లర్లను నియంత్రించడం అంత కష్టమైన పనేమీ కాదంటూనే, ప్రభుత్వ బలహీనతల వల్లే అది సాధ్యం కాలేదన్నది అర్థమవుతుందన్నారు. బహిరంగ దైవ దూషణకు పాల్పడిన వారంతా మృత్యుమార్గాన ఉన్నట్టేనన్న పరిస్థితి అక్కడ కనిపిస్తోందన్నారు.