అంతర్జాతీయం

పశ్చిమాసియాలో ట్రంప్ కార్చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, డిసెంబర్ 7: పవిత్ర నగరం జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా తాము అధికారికంగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. టెల్ అవివ్‌లో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించాలని ట్రంప్ ఆదేశించడంతో కలకలం మొదలైంది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు దారితీసింది. అనేక అరబ్ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మూడు దశాబ్దాలకు పైగా ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి చర్చలకు కీలక భూమిక వహించిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో మళ్లీ అశాంతి రగిలేందుకు కారణం కావడం చర్చనీయాంశమైంది.
ట్రంప్ ప్రకటన అనంతరం ఇజ్రాయెల్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో వందల సంఖ్యలో ఇజ్రాయెల్ మిలటరీ దళాలను మోహరించారు. వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లా నగరంలో భారీఎత్తున నిరసన ప్రదర్శనలకు ఆందోళనకారులు రంగం సిద్ధం చేశారు. గాజా ప్రాంతంలోని హమాస్‌లో బుధవారం రాత్రి వేలాదిమంది కవాతు జరిపి, అమెరికా, ఇజ్రాయెల్ జాతీయ పతాకాలను దగ్ధం చేశారు. అయతే ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ప్రతిజ్ఞ మేరకు జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా తాము అధికారికంగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పవిత్ర నగరం జెరూసలెం తమకే చెందాలని ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ ఇరుదేశాల మధ్య సంఘర్షణను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించేందుకు సమయం ఆసన్నమైందని ఆయన ‘శే్వతసౌధం’లో బుధవారం చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం వెలువడ్డాక పాలస్తీనా ప్రజలు ఆగ్రహానికి లోనవడంతో ‘హమాస్’ నేత ఇస్మయిల్ హనియా గాజాసిటీలో మాట్లాడుతూ తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలకు ట్రంప్ ప్రకటనతో గండిపటినట్టయిందని పాలస్తీనా అధ్యక్షుడు మహముద్ అబ్బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం ‘అన్యాయమైనదిగా, బాధ్యతారహితమైనది’గా సౌదీ అరేబియా పేర్కొంది.
అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని, ఆ పవిత్ర నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించాలన్న ట్రంప్ నిర్ణయం సరైనది కాదని బ్రిటన్ ప్రధాని థెరెసా మే పేర్కొన్నారు. జెరూసలెం స్థాయి పట్ల తమ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలకు ఉమ్మడి రాజధానిగా జెరూసలెం ఉండాలని, గతంలో భద్రతామండలి చేసిన తీర్మానాలను విస్మరించరాదని అన్నారు.
టర్కీ అధ్యక్షుడి ఆగ్రహం
అంకారా: జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచం అశాంతికి గురవుతోందని అన్నారు. జెరూసలెం నగరానికి సంబంధించి 1980లో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి ట్రంప్ నిర్ణయం పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ట్రంప్ నిర్ణయంపై చర్చించేందుకు వచ్చే బుధవారం ఇస్తాంబుల్‌లో జరిగే ‘ఇస్లామిక్ సహకార సంస్థ’ సమావేశంలో చర్చిస్తామని ప్రకటించారు. కాగా, ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇస్తాంబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ముందు దాదాపు 1,500 మంది ఆందోళనకారులు బుధవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయంపై పోప్ ఫ్రాన్సిస్ సహా రష్యా, జర్మనీ తదితర దేశాల అధినేతలతో చర్చలు జరుపుతానని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ తెలిపారు. సిరియా సంఘర్షణల నేపథ్యంలో వాషింగ్టన్, అంకారాల మధ్య బలహీనపడిన సంబంధాలు ట్రంప్ ప్రకటనతో మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.

చిత్రాలు..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు నిరసనగా గురువారం గాజాలో ఆందోళన నిర్వహించి
అమెరికా, ఇజ్రాయెల్ దేశాల జెండాలను దగ్ధం చేస్తున్న పాలస్తీనా ఆందోళనకారులు
*జెరూసలెం నగరం