అంతర్జాతీయం

జాదవ్ భార్యకు పాక్ వీసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 8: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ జైలులో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ ఈనెల 25న తన తల్లి, భార్యను కలుసుకుంటారు. జైలులో ఉన్న జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలుసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. జాదవ్‌ను కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు అనుమతించాలి భారత ప్రభుత్వం పలుసార్లు విజ్ఞప్తి చేయగా పాక్ ప్రభుత్వం ఇందుకు గతంలోనే సుముఖత తెలిపింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపి, జాదవ్‌కు పాకిస్తాన్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారత్ విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో జాదవ్‌కు మరణశిక్షను పాక్ ప్రభుత్వం వాయిదా వేసింది. జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇస్తున్నట్లు గతనెల 10న పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య అధికారులు జాదవ్ తల్లికి, భార్యకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తారు. ఆ ఇద్దరికీ తగిన భద్రత కల్పించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ దౌత్య అధికారులకు లేఖ కూడా రాసింది. జాదవ్‌ను కలిసేందుకు వచ్చే తల్లి, భార్యను ఎలాంటి విచారణ లేకుండా చూడాలని, వారిపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురావద్దని కూడా భారత్ కోరింది. జాదవ్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గతంలో పలుసార్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ విషయమై ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ సొహైల్ మహముద్‌తో సుష్మా చర్చలు జరిపారు. ఈ ప్రయత్నాల నేపథ్యంలో జాదవ్‌ను కలిసేందుకు తల్లి, భార్యకు అనుమతి ఇస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈనెల 25న జాదవ్‌ను అతని భార్య, తల్లి కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని, ఈ మేరకు భారత ప్రభుత్వానికి సమాచారం అందజేశామని పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి మమహ్మద్ ఫైసల్ తెలిపారు. జాదవ్‌ను ఆయన భార్య, తల్లి కలుసుకునే సమయంలో భారత హైకమిషన్ అధికారిని కూడా అనుమతిస్తామని ఆయన చెప్పారు. కాగా, గూఢచర్యం వంటి ఆరోపణలపై తీవ్రమైన శిక్షలు విధించరాదని భారత్ పదే పదే చేసిన వినతులను పాక్ త్రోసిపుచ్చింది. తనకు క్షమాభిక్ష ఇవ్వాలని కోరుతూ జాదవ్ పాక్ ఆర్మీ అధిపతి జనరల్ ఖ్వామర్ బజ్వా వద్ద దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పరిశీలన దశలో ఉంది. ఇరాన్ నుంచి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చొరబడగా జాదవ్‌ను తమ భద్రతా దళాలు పట్టుకున్నాయని పాక్ చెబుతోంది.