అంతర్జాతీయం

50 రౌండ్లు.. 50 ప్రాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓర్లాండో (అమెరికా) జూన్ 13: ఆదివారం సాయంత్రం, గే నైట్ క్లబ్‌లో వీకెండ్ హంగామా. అంతా తాగుతూ, తూగుతూ, తుళ్లుతూ మైకం కైపెక్కి మైమరచి ఉన్న సమయం. సరిగ్గా అదే టైంలో ఏఆర్-15 గన్‌తో 29 ఏళ్ల ముస్లిం అమెరికన్ ఒమర్ మాటిన్ క్లబ్‌లోకి ప్రవేశించాడు. క్లబ్‌లోకి వచ్చీ రావటంతోనే మారణకాండకు ఒడిగట్టిన తీరు అమెరికా దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ముందుగా అక్కడున్న పోలీసును కాల్చేశాడు.. ఆ తరువాత క్లబ్‌లో విచ్చలవిడిగా తూటాల వర్షం కురిపించాడు.. 20 రౌండ్లు.. 40 రౌండ్లు.. 50 రౌండ్లు.. అంతా మైకంలో ఉన్నారు. ఒక్కరు కూడా ప్రతిఘటించే స్థితిలో కానీ, పారిపోయే స్థితిలో కానీ లేరు. మాటిన్ ఎంత షార్ప్ షూటర్ అంటే తాను పేల్చిన ఒక్క తూటా కూడా మిస్‌ఫైర్ కాలేదు. ప్రతి తూటా మనుషులను ఛిద్రం చేస్తూ పోయింది. 50 మంది విగతజీవులయ్యారు. వందమందికి పైగా అతి తీవ్రమైన గాయాలతో క్షతగాత్రులయ్యారు. అంతా అయిన తరువాత పోలీసులు మాటిన్‌ను హతమార్చారు. ‘ఎడమ నుంచి కుడికి.. కుడి నుంచి ఎడమకి అతను కాలుస్తున్న తీరు చూసి ఆశ్చర్యం వేసింది. భయం వేసింది. దేవుడా నేను చనిపోవటం ఖాయమే అని అనుకున్నా’ అని ఓ ప్రత్యక్షసాక్షి తెలిపాడు.
ఒమర్ మాటిన్ గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. మియామీ బీచ్‌లో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకోవటాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడని, ఆ కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అతని తండ్రి అన్నాడు. మాటిన్ మానసికంగా సరిగా లేడని, తొందరగా ఉద్రేకపడే లక్షణాలు ఉండేవాడని అతను చెప్పాడు.

చిత్రం కాల్పులకు తెగబడిన ఒమర్ మాటిన్