అంతర్జాతీయం

పాక్‌ను ఎలా దారికి తేవాలో తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 6: పాకిస్తాన్‌ను ఎలా దారిలోకి తీసుకురావాలో తమకు తెలుసని, దానికోసం అనేక ఆప్షన్లు ఉన్నాయని శే్వతసౌధం శనివారం ప్రకటించింది. ‘పాక్‌ను ఏ విధంగా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. ఆ విషయాలన్నీ అధ్యక్షుడి టేబుల్‌పై ఉన్నాయి’ అంటూ వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్తాన్‌కు ప్రకటించిన సైనిక సహాయం సస్పెండ్ చేస్తూ విధాన నిర్ణయం తీసుకున్న ట్రంప్ తాజాగా పాక్ మెడలు ఎలా వంచాలో తెలుసని చెప్పడం గమనార్హం. రెండు బిలియన్ డాలర్ల మిలటరీ సాయం ఆపేయాలని అమెరికా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ అబద్ధాలు చెబుతూ అమెరికా ప్రభుత్వాన్ని పాక్ మోసం చేసిందని జనవరి 1న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్వర్గ్ధామంగా మారిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్లీట్లు చేశారు. ఇది జరిగిన వారం రోజులు తిరగకుండానే పాకిస్తాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించి సైనిక సాయం ఆపేయాలని నిర్ణయించారు. ‘తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్ పట్ల పాక్ అత్యంత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. పాక్ వ్యవహరించే తీరును బట్టే మా వైఖరి ఆధారపడి ఉంటుంది’ అని శే్వతసౌధం వెల్లడించింది. అమెరికా-పాక్ మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, అయితే పాకిస్తాన్ వ్యవహరించిన తీరుపైనే అదంతా ఆధారపడి ఉంటుందని వైట్‌హస్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు ఆపబోమని, దానికి పాక్ సహకరించాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి అన్నీ ట్రంప్ టేబుల్‌పై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఆఫ్షన్లు ఏమిటన్న విషయంపై ఇపటికిప్పుడు వెల్లడించలేం. ఇరుదేశాల మధ్య తలెత్తిన సమస్య పరిష్కారంపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు’ అని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావాలని అమెరికా విస్పష్టంగా తెలిపింది. ఆఫ్గనిస్తాన్ సరిహద్దులో తెగబడుతున్న తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసి పాక్ తన చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. ఉగ్రవాదంపై పాక్ ద్వంద్వ విధానంతో ఉంటోందన్న కారణంతో సెక్యురిటీ ఫండ్‌తోపాటు వివిధ రకాల సాయంపై అమెరికా ఆంక్షలు పెట్టింది. విదేశీ సైనిక నిధి (ఎఫ్‌ఎస్‌ఎన్) 255 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయానికి అమెరికా కాంగ్రెస్ ప్రకటించి ఉంది. 2016కు సంబంధించిన ఆ సహాయాన్నీ ఆపేయాలని అమెరికా శుక్రవారం నిర్ణయించింది. అలాగే సంకీర్ణ మద్దతు నిధి (సీఎస్‌ఎఫ్) 900 మిలియన్ డాలర్ల సాయాన్ని 2017 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆ నిధిని నిలిపివేయాలని అమెరికా నిర్ణయించింది. సైనిక సాయం నిలిపివేత విషయంలో తాము పునరాలోచించుకోవాలంటే పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని శనివారం శే్వతసౌధం పేర్కొంది. ‘ఉగ్రమూకలపై పాకిస్తాన్ దూకుడు పెంచాలి. ముష్కరులను మట్టుబెట్టడానికి తక్షణం రంగంలోకి దిగాలి’ అని ఆ వర్గాలు సూచించాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయే నిర్ణయించేది పాక్ తీరేనని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మట్టీస్ అన్నారు. పాక్‌కు నిధుల నిలిపివేత విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా ‘ఉగ్రవాదంపై ఆ దేశ వైఖరి మారాలి. ఉగ్రవాదులు అమెరికాకే కాదు... ఉమ్మడి శత్రువు. ఈ విషయాన్ని పాక్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది’ అని అని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పాక్ పాలకులకు గట్టిగా చెప్పామని ఆయన అన్నారు. గత నెలలో పాక్‌లో పర్యటించిన రక్షణ మంత్రి మట్టీస్ పలువురు సీనియర్ నేతలతో చర్చించారు. ‘ఉగ్రవాదంపై ప్రాంతీయ స్థాయిల్లో అవగాహనకు చర్యలు తీసుకోబోతున్నాం. పాకిస్తాన్, భారత్, ఆఫ్గనిస్తాన్‌లను ఇందులో భాగస్వాములను చేస్తాం. సరిహద్దులోకి మరిన్ని బలగాలను మోహరింపచేస్తాం’ అన్నారు. ఒక్క ఆఫ్గనిస్తాన్ విషయంలోనే కాదు కాశ్మీర్ అంశంపై కూడా పాకిస్తాన్ ద్వంద్వ వైఖరితో ఉన్నందున మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా నిర్ణయించినట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థల పట్ల మెతక వైఖరి వీడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్‌ను హెచ్చరించడం ఇది మొదటిసారి కాదని ఆ పత్రిక కథనంలో స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ నుంచి సానుకూల నిర్ణయం రావాలంటే తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్ కఠినంగా ఉండి తీరాల్సిందేనని పునరుద్ఘాటించింది.

చిత్రం..అమెరికా రక్షణ మంత్రి జిమ్ మట్టీస్