అంతర్జాతీయం

తొలి గెలాక్సీ చిక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 14: అంతరిక్ష పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు మరో ముందడుగు వేశారు. మన సౌర వ్యవస్థలోనే కాకుండా దాని ఆవల సుదూర ప్రాంతాల్లో ఉన్న నక్షత్రాలనే కాకుండా నక్షత్ర మండలాల్లో ఉన్న తమ విశ్వ శోధనాపటిమతో వెలికితీస్తున్నారు. తాజాగా 500 మిలియన్ సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీన నక్షత్ర మండలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. నాసా ప్రయోగించిన హబుల్, స్పైజర్ రోదసీ టెలిస్కోపులు మొత్తం విశ్వాన్ని శోధించి ఈ అత్యంత ప్రాచీన నక్షత్ర మండల ఉనికిని నిర్థారించాయి. ఈ నక్షత్ర మండలానికి ఎస్‌పీటీ 0615 జేడీగా శాస్తవ్రేత్తలు నామకరణం చేశారు. ఇంత ప్రాచీనత కలిగిన నక్షత్ర మండలాలను గతంలోకూడా కనుకొన్నప్పటికీ ఈ తాజా గెలాక్సీకి అన్ని విధాల ప్రాధాన్యత ప్రత్యేకత ఉన్నాయి. ఇంత సుదూర నక్షత్రాలు, నక్షత్ర మండలాలు అతిసూక్ష్మ పరిమాణంలోనే కనిపిస్తాయి. అయితే ఈ రెండు రోదసీ టెలిస్కోపులు శక్తివంతమైనవి కావడంవల్ల ఈ గెలాక్సీ ఆనుపానులు సైతం విశే్లషించగలిగే వివరాలను వెలుగులోకి తేగలిగాయి. అయితే ఈ నక్షత్ర మండల నేపథ్యంగా ఉన్న గురుత్వాకర్షక శక్తి చాలా తీవ్రంగా ఉందని, దీనివల్ల అత్యంత విసృత్త స్థాయిలోనే దీన్నుంచి కాంతికిరణాలు ప్రస్ఫుటం అవుతున్నాయని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. అంటే ఇప్పటివరకు కనిపెట్టిన నక్షత్ర మండలాల కంటె కూడా ఈ తాజా గెలాక్సీ తన ఉనికికి సంబంధించి చాలా బలమైన సంకేతాలను అందించిందని నాసా శాస్తవ్రేత్తలు వెల్లడించారు. అత్యంత సుదూరంలో ఉండికూడా ప్రస్ఫుటమైన కాంతి కిరణాలను ప్రసరించిన ఏకైక గెలాక్సీ ఇదేనని, దీనిద్వారా అనేక రకాలుగా ప్రాచీన రోదసీకి సంబంధించిన సమాచారాన్ని విసృతస్థాయిలో అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గెలాక్సీల ఉపరితలంపై గురుత్వాకర్షక శక్తిని విశే్లషించగలిగితే అది ఏ పరిమాణంలో ఉందో, దాని అంతర్గత స్వరూపాన్ని కూడా తెలుసుకొనే అవకాశం ఉంటుందని స్పేస్ టెలిస్కోపు పరిశోధనా సంస్థకు చెందిన బ్రెట్ సాల్మన్ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ శతాబ్దం క్రితమే వెలుగులోకి తెచ్చినట్టుగా ఆయా నక్షత్ర మండలాల ఉనికిపై గురుత్వాకర్షక తరంగాల ప్రభావం చాలా బలంగానే ఉంటుందని, దీనివల్ల వీటినుంచి కాంతికిరణాలు దట్టంగానే ప్రస్ఫుటమవుతాయని వెల్లడించారు.
ముఖ్యంగా అత్యంత ప్రాచీన నక్షత్రాలు, గెలాక్సీలను కనుగొనే ప్రయత్నంలో శక్తివంతమైన జూమ్ లైన్స్‌లను శాస్తవ్రేత్తలు ఉపయోగిస్తారు. దీనివల్ల ఆ నక్షత్రము లేదా నక్షత్ర మండలాన్ని ఎక్కువ పరిమాణంలో చూసే అవకాశం ఉండడంతోపాటు వాటి అంతర్గత స్వరూపాన్ని పరిశీలించే అవకాశమూ ఉంటుందని నాసా శాస్తవ్రేత్తలు తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించే నేటి టెలిస్కోపులతో ఇంత ప్రాచీన నక్షత్ర మండలాలను చూడడానికి లేదా పరిశీలించడానికి అవకాశం ఉండదని, ప్రత్యేకమైన టెలిస్కోపుల ద్వారా ఈ అధ్యయనాన్ని సాగిస్తున్నామని తెలిపారు.
హబుల్, స్పైజర్ టెలిస్కోపుల్లో ఈ జూమ్ లైన్స్ ఉన్నాయి కాబట్టే 500 సంవత్సరాల క్రితంనాటి అత్యంత ప్రాచీనమైన, రోదసీ లోతుల్లోని ఈ గెలాక్సీని కనుగొనగలిగామని తెలిపారు. ఈ తాజా గెలాక్సీకి సంబంధించి తమ అంచనాల ప్రకారం ఈ మొత్తం బరువు 3 బిలియన్ సౌర ద్రవ్యరాశుల కంటె తక్కువగానే ఉంటుందని తెలిపారు. అట్లాగే దీని వెడల్పుకూడా 2500 కాంతి సంవత్సరాల కంటె తక్కువేనని, ఈ గెలాక్సీ అధ్యయనం ద్వారా బిగ్‌బ్యాంగ్ అనంతర కాలంలో సంభవించిన పరిమాణాలను కూడా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని నాసా శాస్తవ్రేత్తలు తెలిపారు. అంతేకాకుండా ఈ విశ్వ తొలిదశ ఎలా ఉండేదన్న దానిపైన వెబ్ టెలిస్కోపుల ద్వారా అధ్యయనాలు సాగించడం ద్వారా ఈ తాజా ఆవిష్కరణ దోహదం చేసే అవకాశం ఉందని బ్రెట్ సాల్మన్ తెలిపారు.