అంతర్జాతీయం

‘వలస విధానాల’పై మద్దతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 31: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండో ఏడాదిలో ప్రవేశించిన డొనాల్డ్ ట్రంప్ ఇపుడు వలస విధానాల్లో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అధ్యక్ష పదవి చేపట్టాక తొలిసారిగా ఆయన ‘స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్’ (ఎస్‌ఓటీయూ)కు హాజరై తన ఎజెండాలోని కీలక అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. వలస విధానాల్లో తాను చేపట్టే సంస్కరణలకు విభేదాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వలస విధానాలతో పాటు గ్రీన్‌కార్డులు, డ్రీమర్లు, ఉత్తర కొరియా, ఐసిస్ ఉగ్రవాదం వంటి అంశాలను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
సుమారు 80 నిమిషాల సేపు ఆయన ప్రసంగించి, అధ్యక్షుడిగా తొలి ఏడాదిలో తాను తీసుకున్న నిర్ణయాలను వివరించారు. నైపుణ్యం ఆధారంగా అమెరికాలోకి వలసలను అనుమతించేందుకు ‘కాంగ్రెస్’ మద్దతు ఇవ్వాలని ఆయన అర్థించారు. భారత్ వంటి దేశాల నుంచి నిపుణులను తమ దేశానికి రప్పిస్తే కలిగే ప్రయోజనాలను ట్రంప్ వివరించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 1.8 మిలియన్ల వలసవాదులు తమ దేశంలో ఉండేందుకు ఇపుడు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వీసాల్లో లాటరీ విధానానికి స్వస్తి పలుకుతూ, ఇతర దేశాల నుంచి కుటుంబాలు వలస వచ్చేందుకు నిబంధనలను సరళతరం చేయనున్నట్లు వివరించారు. తన యంత్రాంగం సాధించిన ఆర్థిక విజయాలను కూడా ఆయన తన ప్రసంగంలో గొప్పగా చెప్పుకున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ‘రష్యా సహకారం’పై విచారణ జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. అమెరికన్లు ఎలాంటి విభేదాలు లేకుండా జీవించేలా రిపబ్లికన్లు, డెమోక్రాట్లు సహకరించాలని కోరారు. ఇన్నాళ్లుగా అమెరికా సాధించిన విజయాలను, ఎదురైన చేదు అనుభవాలను సైతం అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వర్ణం, మతం వంటి వివక్ష చూపకుండా అమెరికా ప్రజలందరినీ కాపాడావలసిన బాధ్యత అధికార, విపక్ష సభ్యులపై ఉందన్నారు. ‘క్షేమదాయకమైన, దృఢమైన అమెరికాను మనం నిర్మించాలి.. ఇది అమెరికన్ల ఉద్యమం.. మన కలలు సాకారం అయ్యేందుకు ఇదే సరైన తరుణం..’ అని ట్రంప్ అన్నారు. నిరుద్యోగం పెరిగిన మాట వాస్తవమేనని, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చిన్న పరిశ్రమలను స్థాపించాలన్నారు. అమెరికన్ కంపెనీలు ప్రపంచంలోని మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వాలన్నారు. ఉత్తర కొరియా రూపొందిస్తున్న క్షిపణుల వల్ల అమెరికన్ నగరాలకు ముప్పు ఉందని, అయితే- గత ప్రభుత్వాల్లో కొందరు నేతలు చేసిన పొరపాట్లను తాను చేయనని అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మొండి వైఖరి వల్ల అమెరికా భూభాగానికి ఎలాంటి ఉపద్రవం రాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలను, ఆర్థిక వ్యవస్థను, విలువలను ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యాలు సవాలు చేస్తున్నాయని అన్నారు. దేశ భద్రతకు సంబంధించి తమ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటామన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ప్రపంచంలో ఎక్కడా మనుగడ లేకుండా చేసేందుకు ఇతర దేశాలతో కలసి నిర్దిష్ట వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు.