అంతర్జాతీయం

64మంది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, మార్చి 26: రష్యాలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 64 మంది మరణించారు. తూర్పు రష్యాలోని సైబీరియాని కెమెరొవొ సిటీలోని వింటర్ చెర్రీ షాపింగ్ మాల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మాల్‌లోని ఫైర్ అలారంలు పనిచేయకపోవడం, నిర్వాహకులు ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం వల్లే ఇంత మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన తరువాత తొలి ఆదివారం కావడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులతో షాపింగ్ మాల్ కిటకిలాడుతోంది. అదే ప్రాంగణంలో థియేటర్లు, స్పా సెంటర్, గేమింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఓ థియేటర్ చెలరేగిన మంటలు అంతటా వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. నాలుగు అంతస్తుల షాపిం గ్ మాల్‌లో మంటలు వ్యాపించి 64 మంది మృతి చెందినట్టు అత్యయక సర్వీసుల మంత్రి వ్లాదిమిర్ పుచ్‌కొ తెలిపారు. ఆరు మృతదేహాలు తప్ప మిగతావాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. థియేటర్‌పై భాగం కుప్పకూలిపోయింది. మరింత మంది అందులో చిక్కుకుని ఉంటారని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన
వారిలో విద్యార్థులు ఎంత మంది ఉన్నారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదని పుచ్‌కొ పేర్కొన్నారు. గాయపడ్డ పది మందిని ఆసుపత్రికి తరలించినట్టు ఆయన వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిని ఆరోగ్యమంత్రి వెరోనికా స్కోవొర్ట్‌సొవా పరామర్శించారు. ఏకంగా నాలుగో అందస్తు నుంచి కిందకు దూకేసిన 11 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని రష్యా అధికార టెలివిజన్ ప్రకటించింది. బాలుడి తల్లిదండ్రులు, అన్న ప్రమాదంలో మృతి చెందారని వెరోనికా తెలిపారు. ప్రమాదంపై తక్షణ దర్యాప్తుజరిపిన అధికారులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. షాపింగ్ మాల్ అద్దెదారుని అరెస్టు చేసినట్టు అధికారులు చెప్పారు. ఫైర్‌సేఫ్టీ నిబంధల ఉల్లంఘన జరిగిందా అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది. అయితే ఎక్కడా ఫైర్ అలారం పనిచేయలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిర్వాహకులు కూడా పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నారని, ఎలాంటి సహకారం అందించలేదని వారు ఆరోపించారు. షాపింగ్ మాల్ నుంచి బయటకు రావడానికి ఎలాంటి అత్యవసర మార్గాలు లేవని కూడా ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అంతకు ముందు ఓ మిఠాయి తయారీ పరిశ్రమ ఉండేది. 2013లో షాపింగ్ మాల్ ఏర్పాటైంది. వింటర్ చెర్రీ మాల్ కెమెరొవొలో ప్రముఖ మాల్స్‌లో ఒకటి. నిత్యం రద్దీగా ఉంటుంది. మల్టీఫెక్స్‌లు, స్కేటింగ్ రింగ్, స్పా సహా అనేక సదుపాయాలు ఉన్నాయి. స్కూళ్లకు సెలవులు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వింటర్ చెర్రీమాల్ రద్దీగా ఉందని కెమెరొవొ వాసులు తెలిపారు.