అంతర్జాతీయం

మదర్సాలో మృత్యుఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందుజ్ (ఆఫ్గానిస్తాన్), ఏప్రిల్ 3: ఆఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లోని ఒక మదర్సాపై జరిగిన వైమానిక దాడిలో భారీ ప్రాణనష్టం సంభవించింది. కనీసం 70 మంది మరణించి ఉంటారని ప్రాథమిక సమాచారం. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. దస్త్-ఇ-అర్చి జిల్లాలోని ఓ మత విద్యాసంస్థ లక్ష్యంగా సోమవారం రాత్రి వైమానిక దాడులు సాగాయి. తాలిబన్‌కు చెందిన కీలక కమాండర్ల ఈ దాడిలో మరణించినట్లు తెలుస్తోంది. కాగా తొమ్మిది మంది తాలిబన్ కమాండర్లతోపాటు 30 మంది మిలిటెంట్లు ఈ దాడిలో హతమైనారని అఫ్గానిస్తాన్ రక్షణ శాఖ ప్రతినిధి మొహమ్మద్ రడ్మానిష్ ఒక అల్‌జజీరా టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. తాలిబన్ శిక్షణ కేంద్రంపై దాడి చేశామని, అక్కడ సాధారణ పౌరులు లేరని ఆయన తెలిపారు. అయితే దాడి సమయంలో తమవారు ఎవరూ ఆ పాఠశాలలో లేరని తాలిబన్ ప్రకటించింది. మరోవైపు ఆఫ్గాన్ ప్రభుత్వం జరిపిన వైమానిక దాడిలో పెద్దఎత్తున చిన్నారులు, పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయని, ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. సంఘటన స్థలంలోని వాస్తవ పరిస్థితిని మానవహక్కుల సంస్థలు అంచనావేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి సహాయబృందం ఒక ప్రకటనలో పేర్కొంది. తాలిబన్ ప్రభావం ఎక్కువగా ఉన్న కుందుజ్‌లోని ఒక మదర్సాలో గ్రాడ్యుయేషన్ వేడుకకు వందల సంఖ్యలో ప్రజలు హాజరైన సందర్భంలో ఈ దాడి జరిగింది. అఫ్గానిస్తాన్ వైమానికి దళానికి చెందిన హెలికాఫ్టర్లు దాడులు చేశాయి. ఈ దాడుల్లో తాలిబన్‌కు చెందిన కీలక రెడ్‌యూనిట్‌కు చెందిన కమాండర్లు పెద్దఎత్తున మరణించారు.