అంతర్జాతీయం

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒట్టావా: కెనాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సస్కాషెవన్ ప్రావిన్స్‌లో ఐస్ హాకీ జూనియర్ ప్లేయర్స్‌తో వెళుతున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ఆటగాళ్లు దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సస్కాషెవన్‌లవ జరుగుతున్న జూనియర్ హాకీ లీగ్ పోటీల్లో పాల్గొనేందుకు హంమోల్డ్ బ్రాంకోస్ జట్టు శుక్రవారం రాత్రి బయలుదేరింది. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ఆటగాళ్లు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 28 మంది ఉన్నారు. వీరిలో 24 మది బ్రాంకోస్ ఐస్ హాకీ జట్టు ఆటగాళ్లు. ఈ ప్రమాదంతో ఆటగాళ్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దేశానికి పేరు తీసుకొస్తారని భావించిన తమ పిల్లలు ఇలా ఆర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాంకోస్ జట్టు ప్రెసిడేంట్ కేవిన్ గారింగార్ మాట్లాడుతూ హైవే 35లో వెలుతున్నపుడు రోడ్డు ప్రమాదం జరిగిందని, మృతి చెందిన వారిలో 16నుండి 21 సంవత్సరాలలోపు యువ ఆటగాళ్లు ఉన్నారని, దీంతో జట్టు గోప్ప ఆటగాళ్లను కోల్పొయిందని కంటతడిపెట్టాడు.
కెనడా ప్రధాని దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో 14 మంది క్రీడాకారులు మృతి చెందిన ఘటన పట్ల కెనడా ప్రధాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లు ప్రమాదానికి గురికావడం చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.