అంతర్జాతీయం

‘చోగమ్’లో మనమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 15: ఈ వారంలో జరుగనున్న కామన్‌వెల్త్ దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (చోగమ్)కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ వెళ్లనుండ టం విశేషం. ఎందుకంటే రెండేళ్లకోమారు జరిగే ఈ సమావేశాలకు దాదాపు దశాబ్దకాలంగా భారత్ హాజరు కావడంలేదు. 2009 నుంచి పెర్త్, కొలంబో, మాల్టాల్లో జరిగిన చోగమ్ సమావేశా ల్లో భారత్ పాల్గొనలేదు. ఏప్రిల్ 18-20 తేదీల మధ్య జరిగే ఈ సమావేశాలకు హాజరుకావడం ద్వారా, అంతర్జాతీయ వే దికలపై భారత్ తన పాత్రను మరింత విస్తరించుకోవడానికి చేస్తున్న యత్నాలకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. అయి తే మోదీ ఈ సమావేశాలకు హాజరు కావాలని తీసుకున్న నిర్ణయం వెనుక, బ్రిటన్ రాణి రెండో ఎలిజెబెత్ స్వయంగా రాసిన లేఖ ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. చోగమ్‌కు ఆమె నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ఇంగ్లం డ్ రెండేళ్ల కాలానికి ‘్ఛర్ ఇన్ ఆఫీస్’ గా బాధ్యతలు స్వీకరిస్తుంది. రాణి రెండో ఎలిజెబెత్ (91) పాల్గొనే ఆఖరి చోగమ్ సదస్సు కూడా ఇదే. వయసు రీత్యా ఇకముందు సదస్సులకు ఆమె హాజరు కాలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె కుమారు డు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సంస్థకు తన తల్లి స్థానాన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశం తో ఉన్నారు. అయితే ఈ స్థా నం వంశపారంపర్యంగా వచ్చేది కాదు. చోగమ్‌లో ని 53 సభ్యదేశాధినేతల ఆమోదం తప్పనిసరి. ఈ సారి చోగమ్ సమావేశాల్లో ఇ దే ప్రధానం కావ డంతో సమావేశాల ముగింపు రోజైన ఏప్రిల్ 20వ తేదీన వాటర్‌లూ ఛాంబర్ ఆఫ్ విండ్‌సార్ కేస్టిల్‌లో, చోగమ్ అధినేతల ‘గె ట్ టు గెదర్’ను ఏర్పాటు చేశారు. ఈ గెట్ టుగెదర్‌కు ఏవిధమైన అజెండా లే దు. ఆయా దేశాధినేతలు తమ సలహాదారులు, సివి ల్ సర్వెంట్ల సహాయంతో ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలు ప్రపంచ, కా మన్‌వెల్త్ ప్రాధాన్యతలపై చర్చిస్తారు. అలాగే సం స్థలో సంస్కరణలపై దృష్టి కేంద్రీకరిస్తారని కామన్‌వెల్త్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
కామన్‌వెల్త్ దేశాలకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నేతృత్వం వహించే విషయంలో సభ్య దేశాల మధ్య ఇంతవర కు ఏకాభిప్రాయం లేదు. రాణి వారసుడి విషయం లో భారత్ ఇంతవరకు తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. అయితే 69ఏళ్ల యువరాజు ఈ సంస్థకు నే తృత్వం వహించడానికి ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన నేతృత్వం వహించడం సదస్సుకు హాజరయ్యే 53 దేశాల అధినేతల నిర్ణయంపై ఆధారపడివుంది. వారి నిర్ణయం తర్వాత కామన్‌వె ల్త్ సెక్రెటరీ జెనరల్ పాట్రిసియా స్కాట్‌లాండ్ ప్రకటన విడుదల చేస్తారు. అయితే ముగిం పు సందర్భంగా ఏర్పాటు చేసే ఈ గెట్ టు గెదర్‌లో వివిధ దేశాధిపతులు, రాణి వారసుడిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బహుశా త మ నిర్ణయాన్ని తర్వాతి చోగమ్ సమావేశానికి వా యిదా వేసే అవకాశాలున్నా యి. పూర్వపు బ్రటిష్ వలస రాజ్యాలతో కలిపి ఏర్పాటైందే కామన్‌వెల్త్. ఈ దేశాల మొత్తం జనాభా 2.5 బిలియన్లు. ఇందు లో దాదాపు సగం జనాభా వున్న భారత్ అతిపెద్ద దేశం. అంతేకాదు, 2005-16 మధ్యకాలంలో కామన్‌వెల్త్ దేశాల్లో అత్యధిక మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది భారత్ మాత్రమే. కా మన్‌వెల్త్ నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐ విషయంలో తొలిస్థానం భారత్‌దే. ‘ప్రస్తుతం కామన్‌వెల్త్ పట్ల భారత్ వైఖరిలో మార్పు వచ్చింది. ఇది కామన్‌వెల్త్‌కు ఎం తో ప్రయోజనకరం’ అని, కామన్‌వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ (సీడబ్ల్యుఈఐసీ) లార్డ్ మ్యారీలాండ్ అన్నారు. ఈ బిజినెస్ ఫో రం సమావేశం సోమవారం నుంచి ప్రారంభమై వారం పాటు కొనసాగుతుంది. ఇందులో ఐదువేల మంది సభ్యులు పాల్గొంటారని అంచనా.
మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు బ్రి టన్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి, ఆ దేశం అసాధారణ రీతిలో ఆహ్వానం పలుకనున్నది. చోగమ్ సమావేశానికి హాజరుకానున్న నేత ల్లో, బ్రిటన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నది కేవలం నరేంద్ర మోదీతోనే. మనదేశానికి బ్రిట న్ ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నదో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో, బుధవారం మోదీ ఒకసారి కాదు రెండుసార్లు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. స్వీడన్ పర్యటనలో ఉన్న ప్ర ధాని, మంగళవారం రాత్రి లండన్‌కు చేరుకుంటా రు. బుధవారం సాయంత్రం రాణి రెండో ఎలిజెబెత్ ప్రసంగాన్ని వినడానికి ఆహ్వానం అందుకున్న ము గ్గురు ప్రపంచంలో అత్యంత సీనియర్ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరు. మోదీకి, బ్రిటిష్ రాజకుటుం బం పలికే స్వాగత కార్యక్రమంలో ప్రిన్స్ ఛార్లెస్ ఆ తిథ్యమిచ్చే ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంటుంది. బ్రిటన్ మన దేశానికి ఎంతటి ప్రాధాన్యతినిస్తున్నదీ, ప్రధానికి ఇస్తున్న అసాధారణ స్వాగతం చెప్పకనే చెబుతున్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
బ్రిటన్ ప్రధాని థెరిస్సా మేతో జరిపే చర్చల్లో పరస్పర ప్రయోజన అంశాలు, సీమాంతర ఉగ్రవాదం, వీసాలు, వలసలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నది. అక్రమ వలసదార్లను స్వదేశానికి తిప్పి పంపడంపై ఇరుదేశాలకు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం 2014తో ముగిసింది. ప్రస్తుతం దీన్ని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని భా రత్-యూకెల మధ్య సాంకేతిక సహకారంపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది. ఈ అంశంపై ఉ మ్మడి ప్రకటన వెలువడవచ్చు. థెరెస్సా మేతో చ ర్చల తర్వాత మోదీ ‘5000 ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్’ ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు సైన్స్ మ్యూజియంకు వెళతారు. ఈ సందర్భంగా పలువురు శాస్తవ్రేత్తలతో ముచ్చటిస్తారు. తర్వాత ఆయన లండన్ లో ‘్భరత్ కీ బాత్’, ‘సబ్‌కే సాత్’ కార్యక్రమంలో బ్రిటన్‌లోని భారతీయులతో ప్రసంగిస్తారు. ఇది దే శవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రెండువేలమంది పాల్గొంటారు. బసవేశ్వర విగ్రహానికి నివాళులు
థేమ్స్ నది ఒడ్డున ఉన్న బసవేశ్వర విగ్రహానికి నివాళులర్పిస్తారు. 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వర లింగాయాత్ తత్వవేత్త, సామాజిక సంస్కరణ వేత్త. ఈ కార్యక్రమాన్ని బసవేవ్వర ఫౌండేషన్ నిర్వహిస్తుంది. థేమ్స్ నది ఒడ్డున బసవేశ్వర విగ్రహాన్ని నెలకొల్పింది ఈ సంస్థే. 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వర కులరహిత సమాజం కోసం పాటుపడ్డారు. కుల, మత వివక్షలపై పోరాటం చేశారు. అంతేకాదు బసవేశ్వర ప్రముఖ ప్రజాస్వామ్యవాది. ఆయన విగ్రహాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి హ యాంలో పార్లమెంట్ హాలులో ప్రతిష్ఠించారు.