అంతర్జాతీయం

కిమ్‌తో భేటీ తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో జరపనున్న చర్చలు సాఫీగా, ప్రశాంతంగా సాగుతాయనే విశ్వాసం తనకు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. సింగపూర్‌లో జూన్ 12వ తేదీన కిమ్‌ను కలిసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చర్చలు చక్కగా జరుగుతాయి. ఇందులో ఎటువంటి అనుమానంలేదు అని ట్రంప్ విలేఖర్లకు చెప్పారు. శే్వతసౌధంలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియా, దక్షిణ కొరియా అధినేతలు శనివారం సమావేశమైన సంగతి విదితమే. జూన్ 12 సమావేశం అనుకున్నట్లుగా బాగా జరుగుతుందని ట్రంప్ పదే పదే చెప్పారు. ఈ సమావేశం ఫలప్రదమయ్యే విధంగా అధికారులు ముందస్తుగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అనేక సమావేశాలు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి. వీటి వివరాలను నేను ఇప్పుడే చెప్పను అని ట్రంప్ తెలిపారు. కొరియాదేశాలు అణ్వస్త్ర నిరాయుధీకరణను పాటించాలని కోరుతున్నట్లు చెప్పారు. దీనివల్ల కొరియా దేశాలకు, జపాన్, చైనా, అమెరికాతో పాటు ప్రపంచానికి పెద్ద ఉపశమనం కలుగుతుందన్నారు. కొరియా దేశాల అధినేతలు మూన్, కిమ్‌ల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు. రెండు రోజుల క్రితం అమెరికా- ఉత్తర కొరియానేతల మధ్య చర్చలు జరగడం అనుమానమేనన్న వార్తలు ప్రసారమయ్యాయి. తాజాగా ట్రంప్ విలేఖర్లతో మాట్లాడుతూ జూన్ 12న సింగపూర్‌లో చర్చలు జరుగుతాయని ప్రకటించడం విశేషం. అమెరికా, తదితర దేశాల నుంచి దురాక్రమణ భయం ఉన్నంత వరకు తాము అణ్వస్త్రాలను త్యజించే ప్రసక్తిలేదని ఉత్తర కొరియా ఇప్పటికే పలుసార్లు ప్రకటించిన విషయం విదితమే.