అంతర్జాతీయం

ఎప్పటికైనా ఛేదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్‌బెర్రా, మే 29: హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తూ అదృశ్యమై సముద్ర జలాల్లో పడిపోయినట్లు భావిస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం 370కు చెందిన శకలాలను ఏదో ఒక రోజు కనుగొని తీరుతామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇప్పటికి మాత్రం విమానం ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు నిలుపుదల చేసినా, మిస్టరీని ఒకరోజు చేధిస్తామని ఆస్ట్రేలియా పేర్కొంది. 2014 మార్చి 8వ తేదీన బోయింగ్ 777 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరి మార్గమధ్యంలో హిందూమహాసముద్రం గగనతలంలో అదృశ్యమైన విషయంవిదితమే. టెక్సాస్‌కు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ సంస్థకు ఈ విమానాన్ని ఆనే్వషించే పనిని మలేషియా అప్పగించింది. 90 రోజులు గడువు ఇవ్వగా, ఇప్పటికి రెండుసార్లు గడువును పొడిగించారు. ఆ గడువు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ రవాణా శాఖ మంత్రి మైఖేల్ మెక్ కోర్‌మార్క్ మాట్లాడుతూ, వైమానిక రంగ చరిత్రలో నాలుగేళ్ల పాటు నిరంతరం అదృశ్యమైన విమానం కోసం ఆనే్వషించడం ఇదే తొలిసారి అన్నారు. ఈ విమాన ప్రమాదంలో 239 మంది మృతి చెందారు. ఎవరి ఆనవాళ్లు కనపడలేదు. శాస్తవ్రిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, ఈవిమానం అదృశ్యం టెక్నాలజీకి ఎప్పటికీసవాలే నని చెప్పారు. ఏదో ఒక రోజు ఈ విమానాన్ని కనుగొని తీరుతామని ఆయన చెప్పారు. టెక్సాస్ సంస్థతో మలేషియా ఈ విమానం ఆచూకీని కనుగొనేందుకు తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానం కోసం ఆస్ట్రేలియా, మలేషియా, చైనా దేశాలు ఆనే్వషించి, తమ ప్రయత్నాలను నిలిపివేశాయి. టెక్సాస్‌కు చెందిన సంస్థ సముద్రం అడుగున డ్రోన్లను ప్రయోగించి 96వేల చదరపు కి.మీ ప్రాంతంలో ఆనే్వషించాయి. ఈ విమానం అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ విమానం మిస్టరీపై అనేక థియరీలు, పుకార్లు ఉన్నాయి. వీటిని చేధించాలని ఆమె కోరారు. కాగా టెక్సాస్‌కు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ కూడా విమానాన్ని కనుగొనలేని పక్షంలో అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదని, కాని ఒక రోజు ఈ విమానం మిస్టరీ వీడుతుందని ఆస్టేలియాకు చెందిన విమాన సంస్థ డైరెక్టర్ పీటర్ ఫోలే అన్నారు.