అంతర్జాతీయం

మనవి ప్రాచీన నాగరికతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా, మే 29: భారత్, ఇండోనేషియాలు ప్రాచీన నాగరికత, బహుళ సంస్కృతులు కలిగి ఉన్న దేశాలని, ఈ నాగరికతల మధ్య లోతైన, అవినాభావ సంబంధాలున్నాయని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తూర్పు ఆసియాలో మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఇక్కడకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఇండోనేషియా పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతాయని, రాజకీయంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టమవుతాయని నరేంద్రమోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండోనేషియాలో మోదీ పర్యటించడం ఇది తొలిసారి. సముద్ర విజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక సహకారంపై ఆ దేశాధ్యక్షుడు జోకో విడుడోతో బుధవారం మోదీ చర్చించనున్నారు. ఇండోనేషియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసే సిఇవో బిజినెస్ ఫోరమ్‌లో ఇరుదేశాల అధినేతలు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 30వ తేదీ బుధవారం ఇండోనేషియా అధ్యక్షుడితో అభివృద్ధిపై మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల సంబంధాలు ఈ చర్చల వల్ల పటిష్టమవుతాయి ’ అని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ భారత సంతతి ప్రజలతో కూడా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఇరు దేశాలు సంబంధాలు నాగరికత, చారిత్రకపరంగా ముడిపడి ఉన్నాయన్నారు. రెండుదేశాలు బహుళ జాతులు, సంస్కృతులు, నాగరికతకు నిలయాలని ఆయన శ్లాఘించారు.
ఆసియాలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలని ఆయన అన్నారు. మే 31వ తేదీన సింగపూర్‌కు వెళుతూ ఆయన మలేషియాలో కొద్దిసేపు బస చేయనున్నారు. ఈ సందర్భంగా మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్‌తో చర్చలు జరపనున్నారు. జూన్ 1వ తేదీన మోదీ సింగపూర్‌లో వార్షిక భద్రత సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో భారత్ ప్రధాని పాల్గొనండం తొలిసారి కావడం విశేషం. ప్రాంతీయ భద్రత సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు అవకాశం ఉందని మోదీ చెప్పారు. సింగపూర్ అధ్యక్షుడు హాలీమహ్ యాకూబ్‌తో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.

చిత్రం..ఇండోనేసియా, మలేసియా, సింగపూర్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ