అంతర్జాతీయం

కాశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 31: భారత్ నియంత్రణ రేఖవద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ ప్రజలకు తమ మద్దతు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేసింది. పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ గురువారం మాట్లాడుతూ, వ్యతిరేకతను మానుకొని, పాక్‌తో ఏవిధమైన షరతులు లేకుండా చర్చలు జరపడమే భారత్‌కు ఉత్తమ మార్గమన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ షరీఫ్ (పీఎంఎల్-ఎన్) ప్రభు త్వం ఐదేళ్ల కాలంలో సాధించిన విజయాలను వివరిస్తూ ఆయన, కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో బలంగా ప్రస్తావించామన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని, నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. సార్క్ మరింత ముందుకు పోకుండా ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. యురి సెక్టార్‌లో ఉగ్రవాదుల దాడిలో 17 మంది భారత జవాన్లు మరణించారు. ఇందుకు నిరసనగా భారత్ ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సమావేశాన్ని బహిష్కరించింది. 2016 నుంచి సార్క్ సమావేశం జరగడంలేదు. తన భూభాగంపై పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేవరకు సార్క్ సదస్సు జరగడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. కుల్‌భూషణ్ యాదవ్ విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘పాక్‌లో అస్థిరత సృష్టించేందుకు భారత్ యత్నిస్తున్నదని, కుల్‌భూషణ్ యాదవ్ అరెస్ట్‌తో స్పష్టమైంది’ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియకు తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు.