అంతర్జాతీయం

ముషారఫ్ పాస్‌పోర్టు బ్లాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 31: పాక్ మిలిటరీ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డును బ్లాక్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం దేశీయాంగ శాఖను ఆదేశించింది. ప్రత్యేక కోర్టు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. రాజద్రోహం కేసులో నిందితుడిగా ఉన్న ముషారఫ్ పాకిస్తాన్‌కు వచ్చేందుకు, కొన్ని సదుపాయాలు పొందడంపై ఆంక్షలు విధించారు. ముషారఫ్‌పై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే బాధ్యతను నేషనల్ డాటా బేస్ రిజిస్ట్రేషన్ అథారిటీని ప్రభుత్వం ఆదేశించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ పేర్కొంది. కోర్టు ఆదేశాల వల్ల బ్యాంకు లావాదేవీలు కూడా నిర్వహించలేరు. పాకిస్తాన్‌లో తన ఆస్తులను విక్రయించే హక్కు, కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే హక్కును ముషారఫ్ కోల్పోతారు. 2007లో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినందుకు ముషార్రఫ్‌పై కేసు నమోదుకాగా కోర్టు విచారణ జరుపుతోంది. ముషారఫ్‌ను అరెస్టు చేసి ఆస్తులను జప్తు చేయాలని కూడా కోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఏడాది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మియాన్ సకీబ్ నిసార్ మాజీ నియంత ముషారఫ్‌పై విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అంశంపై నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. 2007లో ముషార్రఫ్ వందమంది జడ్జిలను గృహ నిర్బంధం చేయడమేకాకుండా, వారిని పదవుల నుంచి తొలగించారు. ఈ ఘటనలపై ముషార్రఫ్‌పై కేసులు కూడా నమోదు చేశారు.